పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నాడు అనగానే భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. పవన్ లుక్ ఎలా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేస్తున్నారు అని సినీ జనాలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ లుక్ గురించి ఓ క్లారిటీ ఇచ్చిన పవన్.. హీరోయిన్ విషయంలో మాత్రం కొంచెం క్రేజీగా ఆలోచిస్తున్నాడు.

 

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు. భారతదేశాన్ని బ్రిటీష్ వలస పాలకులు దోచుకుంటోన్న కాలం నాటి కథతో రూపొందుతోంది ఈ చిత్రం. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లీషోళ్లు దోచుకెళ్లిన సంపదని.. ఎత్తుకెళ్లి పేదలకు పంచే పాత్రలో కనిపించబోతున్నాడు పవన్.

 

పవన్ కళ్యాణ్ మొదటి సారి నటిస్తోన్న ఈ పీరియాడికల్ డ్రామాలో పవర్ స్టార్ లుక్ ఎలా ఉంటుంది అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లుక్ ఎలా ఉంటుంది అనే విషయంలో చిన్న క్లారిటీ ఇచ్చాడు పవన్. మొన్నటి వరకు గుబురు గడ్డంతో కనిపించిన పవన్.. ఇపుడు నీట్ షేవ్, లాంగ్ హెయిర్ తో దర్శనమిచ్చాడు. 


క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ని తీసుకుంటున్నారట. గ్లామర్ డోస్ తో సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించే వాణీని హీరోయిన్ గా తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని.. ఈమె త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని చెబుతున్నారు. 

 

వాణీకపూర్ కు బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా భారీ ఇమేజ్ ఉంది. కానీ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన వార్ ఓకే అనిపించుకున్నా.. వాణీకి కొంచెం కూడా పేరు రాలేదు.  పైగా ఇక్కడ నానితో ఆహా కళ్యాణం అంటే అది కూడా మేళం లేని పెళ్లిలా సైలెంట్ గా వెళ్లిపోయింది. అలాంటి హీరోయిన్ ని పవన్ కు జోడీగా సెలక్ట్ చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: