టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ విషయమై అప్పట్లో వర్ధమాన నటి శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం టాలీవుడ్ లో రహస్యంగా ఇంత జరుగుతోందా అంటూ ఆ విషయమై షాక్ అయ్యారు. కొందరు సినిమాలకు పని చేసే కో ఆర్డినేటర్లు, మేనేజర్లు కొత్తగా సినిమా అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలను తమ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాం అని చెప్పి, వారిని లైంగికంగా లొంగదీసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని అప్పట్లో శ్రీరెడ్డి మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన కూడా చేసింది. 

 

అయితే ఆ తరువాత పలు వివాదాల నడుమ ఆ సమస్య ముగిసింది. కాగా అదే సమయంలో ఆ ఘటనతో శ్రీరెడ్డి అందరి దృష్టిలో పడి పేరు దక్కించుకుంది. అనంతరం ఒకానొక సమయంలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, అక్కడి నుండి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అవుతూ వస్తోంది. అది మాత్రమే కాక కొందరు టాలీవుడ్ వ్యక్తులు తనకు అవకాశాలు ఇప్పిస్తాం అని లైంగికంగా వాడుకున్నట్లు కూడా చెప్పిన శ్రీరెడ్డి, అప్పట్లో నాని, రానా తమ్ముడు అభిరాం, దర్శకులు కొరటాల, శేఖర్ కమ్ముల, నిర్మాత, రచయిత కోన వెంకట్ సహా మరికొందరు పేర్లు బయటపెట్టింది. ఇక ఇటీవల పూర్తిగా చెన్నై కి షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి, తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పవన్ సహా మరికొందరు నటులు, రాజకీయ నాయకులపై తన అకౌంట్స్ ద్వారా వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సందిస్తూనే ఉంది. 

 

అయితే గత కొద్దిరోజలుగా పవన్ కళ్యాణ్ పై, అలానే మెగా ఫ్యామిలీ పై కావాలనే టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న పోస్టులపై కొందరు మెగా ఫ్యాన్స్ భారీ స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మొదట్లో పవన్ ని విమర్శించిన నువ్వు, గత కొద్దిరోజలుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శించడం సరైనది కాదని, నీకు అసలు సిగ్గు, సెరం, మానం, అభిమానం, రోషం అనేవి లేనే లేవా, అసలు నిజంగా నువ్వు ఆడదానివి అయితే ఈ విధంగా పని గట్టుకుని వారి మీద కావాలనే ఎందుకు బురద చల్లుతూ విమర్శలు చేస్తావు అంటూ ఆమెపై విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: