జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకుని  దూసుకుపోతున్న హీరో. తాతకు తగ్గ మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది నట విశ్వరూపం. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మొన్నటికి మొన్న అరవింద సమేత సినిమా తో... తనలోని నట విశ్వరూపాన్ని చూపించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ అనే మూవీలో మరో స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. 

 


 అయితే రాజమౌళి సినిమా అంటే భారీ హిట్ ఖాయం దీంతో అటు అభిమానులు కూడా తమ అభిమాన హీరోకి  హిట్ చేరిపోతుంది అని ఆనందంగా ఉండాలి కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నిరాశగా  ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వరకు జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడి తో కూడా మూడు సినిమాలకు మంచి చేయలేదు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తో మాత్రం ప్రస్తుతం చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నాలుగవ సినిమా. ఇంతకు మునుపే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చి సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా విజయంలో కూడా ఇలాంటి డోకా లేదు కానీ...  ఎన్టీఆర్ ఎప్పుడు సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల చేసేలా చూసుకుంటూ అభిమానులను అలరిస్తోంది ఉంటాడు. 

 

 హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా ఎన్టీఆర్ సంవత్సరానికి రెండు సినిమాలను అభిమానులకు ముందు ఉంచుతూ ఉంటాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో... 2019 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఒక్క సినిమా కూడా రాలేదు.... సరేలే 2019లో లేకపోతే ఏంటి 2020లో ఇంకొన్ని రోజుల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్  సినిమా విడుదలై . బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చాలు అని అభిమానులు సర్దుకుపోతూన్నా  సమయంలో.. అభిమానులందరికీ భారీ షాక్ ఇచ్చింది ఆర్.ఆర్.ఆర్ చిత్రబృందం . సినిమా 2020లో కాదు 2021 జనవరి 8వ తేదీన విడుదల చేస్తున్నాం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో రెండు సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: