నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన పైసా సినిమాతో  తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కేథరిన్ తెరెసా. ఆ తర్వాత తన అందంతో ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించిన ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. తన అందం అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది ఈ అమ్మడు. దగ్గుబాటి రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా లో నటించడం... ఇలా చాలా సినిమాల్లోనే అవకాశాలను అందిపుచ్చుకొని తన సత్తా ఏంటో చాటింది కేథరిన్ . ఇక ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక సరైనోడు సినిమా లో కూడా ఎమ్మెల్యే పాత్రలో నటించిన ఈ అమ్మడు తెలంగాణ యాసతో అదరగొట్టింది. 

 


 ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వరల్డ్ ఫేమస్ ఫ్లవర్. సినిమాలో ఓ పాత్రలో నటిస్తుంది ఈ అమ్మడు. అయితే ఈ సినిమాలో కేథరిన్ తో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉన్నారు. రాశిఖన్నా ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా  కూడా కేథరిన్ తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లుగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14న వాలెంటెన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది చిత్రబృందం. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన కేధరిన్  సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో తెలిపింది. 

 

 వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో స్మిత  అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నారని తెలిపిన కేథరిన్... బొగ్గు గనుల్లో పనిచేసే అధికారిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కనిపిస్తాను  అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా బోయపాటి శ్రీనివాస్ బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నాను అంటూ  చాలాచోట్ల వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే దర్శక నిర్మాతలు కూడా నన్ను సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో చాలామంది మీరు అడిగినట్లుగానే  నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఈ విషయంలో నేను చెప్పే సమాధానం ఒక్కటే... నందమూరి బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానో  లేదో తెలియాలంటే మాత్రం ఆ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను నేను అడగాలి అంటూ అందరిలో  ఆసక్తి కలిగేలా  సమాధానమిచ్చింది కేథరిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: