థియేటర్ కు ఆడియెన్స్ ను రప్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈమధ్య సినిమాలు వస్తున్నాయి. స్టార్ సినిమాలు ఎలాగు పబ్లిసిటీ ఇచ్చినా ఇవ్వకున్నా మొదటిరోజు వసూళ్లు ఉంటాయి. అయితే చిన్న సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ ముందు ప్రమోషన్సే ఎక్కువ ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తాయి. అయితే ఇప్పుడు వారు కూడా సినిమాలో అవసరం ఉన్నా లేకున్నా లిప్ లాక్స్ పెట్టి ప్రేక్షకులను థియేటర్ బాట పట్టేలా చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ లో హీరో హీరోయిన్ లిప్ లాకులు, బోల్డ్ సీన్స్ తో నింపేస్తున్నారు.

 

ఇంకేముంది ట్రైలర్ లోనే ఇంత మ్యాటర్ ఉంటే ఇంక సినిమాలో ఏముందో అని వచ్చేస్తున్నారు. అర్జున్ రెడ్డికి ముందు పరిస్థితి ఒకలా ఉంది.. ఎప్పుడైతే అది వచ్చిందో ఇక తెలుగు సినిమాల్లో లిప్ లాక్ అన్నది కామన్ అయ్యింది. అర్జున్ రెడ్డి తర్వాత ఆరెక్స్ 100 సినిమా మరింత చెడగొట్టేసింది. అర్జున్ రెడ్డి, ఆరెక్స్ 100 సినిమాల్లో కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందని అలా చూపించగా అదే దారిలో కేవలం బోడ్ల్ సీన్స్ తోనే సినిమా నింపేస్తున్నారు కొందరు దర్శకులు. అలాంటి కోవలో వచ్చిన లేటెస్ట్ మూవీ డిగ్రీ కాలేజ్. అసలు దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలచుకున్నాడో ఏమో కాని డిగ్రీ కాలేజ్ అని ఓ బూతు బొమ్మని తీశాడు.

 

హీరో హీరోయిన్ చేసుకునే రొమాన్స్ కు అర్ధం లేకుండా అదేదో కామవాంచ ఉన్నట్టుగా సినిమాలోని కొన్ని సీన్స్ ఉండటం చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సినిమా కంటెట్ కోరుతుంది కాబట్టే అలాంటి సీన్స్ పెడుతున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నా సినిమా చూసిన ఆడియెన్స్ మాత్రం అడల్ట్ డోస్ ఎక్కువైందని చెప్పుకుంటున్నారు. ఇదంతా యూత్ ను ఎట్రాక్ట్ చేసి ఓపెనింగ్స్ కోసం చేసే ప్లాన్ అని అందరికి తెలిసిందే.   

 

అయితే ఇలాంటి సినిమాలు చేయడం కన్నా బీ గ్రేడ్ సినిమాలు.. బూతు బొమ్మలు చేసుకోండని ఒక వర్గం ప్రేక్షకులు సలహాలిస్తున్నారు. నేటి యువత మీద సినిమా ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి సినిమాల్లో హీరోలు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి కాని తప్పతాగి హీరోయిన్ తో మూతి ముద్దుల కోసం కక్కుర్తి పడకూడదు. అయినా వీళ్లని అనేం లాభం మాకు ఇలాంటి సినిమాలే కావాలని కోరుకునే ఆడియెన్స్ కు కూడా ఈ తప్పులో భాగం ఉందని చెప్పొచ్చు. ఓ పక్క తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంటే హీరోయిన్స్ బికినీలు, హాట్ సీన్స్ తో స్థాయి తగ్గించేలా ఉన్నారు. మరి సెన్సార్ బోర్డ్ ఈ విషయంపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రేక్షకులు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: