అక్కినేని సమంత గత సంవత్సరం మజిలీ, ఓ బేబి సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకుంది. ఆ రెండు సినిమాలు తన కెరీర్ లో మంచి సినిమాలుగా మిగిలిపోతాయనడం లో ఎలంటి సందేహం లేదు. ఇక ఉత్సాహంతోనే చాలా ఆలోచించి దిల్ రాజు సినిమాకి కమిటయింది. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి కోలీవుడ్ హిట్ సినిమా 96 రీ మేక్ జాను సినిమాలో నటించింది. 96 ని తెరకెక్కించిన తమిళ దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెలుగు వర్షెన్ కి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం కాస్త షాకయ్యో విషయం.

 

మాస్ మహా రాజా రవితేజ్ నటించిన ఆ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాంటి కథ తో ఈ సినిమా తెరకెక్కించడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం. వాస్తవంగా దర్శకుడు ఎక్కడా కూడా కథని డీవియోట్ చేయకుండా సమర్ధవంగా నడిపించాడు. ఒకరకంగా చెప్పాలంటే తమిళం కంటే తెలుగు స్క్రీన్ ప్లేలోనే పక్కాగా అల్లుకున్నాడు. అదే సినిమాకి పెద్ద ఎస్సెట్. మధురానుభూతల్ను గురు చేసుకుంటూ కథ ని సాగించడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. ఆ విషయంలో డైరెక్టర్ సక్సస్ అయ్యాడు.

 

ఇక సమంత, శర్వానంద్ సినిమాకి గట్టి బలంగా నిలిచారు. ఎక్కడా కూడా ఇది తమిళ సినిమా రీమేక్ అన్న భావన కలగకుండా సినిమా మొత్తాన్ని తమ భుజాల మీద వేసుకొని నడించారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అంతే అరుదుగా ఇలాంటి సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అయితే మొత్తంగా సమంతసినిమా సక్సస్ కి కారణం అని అంటున్నారు. అసలు ఇలాంటి కల్ట్ మూవీ ని ఒప్పుకున్నందుకు నువ్వు ఎంతో గొప్పదానివి అంటూ కితాబిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: