టాలీవుడ్ నిర్మాతకి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్యానర్ కి గొప్ప పేరుంది. ఫ్యామిలీస్ మొత్తానికి ఆ బ్యానర్ మీద ఆ నిత్మాత మీద గట్టి నమ్మకం ఉంది. అయితే అది ఈ మధ్య కాస్త తగ్గుతోంది. ట్రాక్ తప్పుతున్నాడని కామెంట్స్ వినపడుతున్నా మారడం లేదు. మొండి ధైర్యమో మూర్ఖత్వమో అలాగే కొనసాగుతున్నాడు. మరి ఇలా ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. లేదా ఆయన్ని ఆయనే ప్రశ్నించుకోవాలి. ఎప్పుడు స్ట్రైట్ సినిమాలతో భారి సక్సస్ లను అందుకొని టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ కొంతకాలం నుండి రీమేకుల మీద మోజుపడి మేకులు దించుకున్నాడని చెప్పుకుంటున్నారు.ఆ మేకులు ఆయంకొక్కడికే దిగితే చాలదన్నట్టుగా అందరికి దింపుతున్నాడు.

 

కోలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తో సక్సస్ ని అందుకున్న 96 సినిమాని దిల్ రాజు తెలుగులో నిర్మించాడు. త్రిష-విజయ్ సేతుపతి నటించిన పాత్రలలో సమంత-శర్వానంద్ లు పోషించారు. వాస్తవంగా ఈ సినిమాని సమంత ముందు చేయలేనని రాజు తో చెప్పారు. అయినా ఆయన వినకుండా ఈ పాత్రకి మీరు మాత్రమే న్యాయం చేస్తారని ఒప్పించారు. కథ కూడా నచ్చడంతో సమంత చాలా నమ్మకం పెట్టుకొని చేసింది. అదే జాను. సినిమా కల్ట్ కంటెంట్ కాబట్టి జనాలకి ఎక్కడం ఎక్కకపోవడం అన్నది లక్ మీదే ఆధారపడి ఉంటుంది.

 

ఎందుకంటే ఈ తరహా సినిమాలు అయితే సూపర్ హిట్ లేదా భారీ డిజాస్టర్. ఇప్పుడు జాను పరిస్థితి ఈ రెంటి మధ్య కొట్టు మిట్టాడుతోంది. రెండు రోజులైతేగాని అసలు విషయం తెలియదు. అయితే సినిమాకి టాక్ పరంగా హిట్ అన్నప్పటికి రిజల్ట్ పరంగా ఫ్లాప్ ఏమో అన్న వెరైటీ టాక్ వినిపిస్తోంది. పాపం సమంత అనవరసంగా కమిటయిందా అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. ఏదేమైనా బలవంతంగా నమ్మించి ఒప్పించి సమంత ని దిల్ రాజు మోసం చేశాడనే టాక్ మొదలైంది. మరి ఇది నిజమేనా అంటే సరైన సమాధానం సరిగ్గా రావడం లేదు.  ఒకవేళ అదే నిజమైతే ఇక సమంత జీవితంలో మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయదని అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: