పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తున్నాడంటేనే ఊగిపోతున్నారు మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్. సినిమా ఎప్పుడు వస్తుందా.. పవన్ ను తెర మీద ఎప్పుడెప్పుడు చూప్తామా అనే ఆరాటం రోజు రోజుకీ వారిలో పెరిగిపోతోంది. వారిలానే అభిమానిగా ఉండి బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేశ్ పరిస్థితి కూడా ఇదే. పవన్ మళ్లీ సినిమాలు చేయాలని తపించిన వాళ్లలో బండ్ల కూడా ఒకడు. అదే అభిమానాన్ని ఇప్పుడు వరుస ట్వీట్లతో తెలియజేస్తున్నాడు.

 

 

‘కళ్లలో కసి, ముక్కు మీద పౌరుషం, మీసంలో నిజాయితీ నీ సొంతం బాస్’, ‘అడిగితే ఇచ్చేది ప్రసాదం.. పూజిస్తే వచ్చేది వరం.. నాకు కావాల్సింది వరం లాంటిది జీవితం. అది తప్పకుండా వస్తుంది’, ‘దేవుని అడగకూడదు.. తప్పు! కోరుకోవాలి అప్పుడే కోరిక తీరుతుంది..’ అంటూ వరుస ట్వీట్లతో హోరెత్తించేశాడు. ఈ ట్వీట్లకు పవన్ తన గడ్డం తీసేసిన లేటెస్ట్ పిక్స్ ను యాడ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. అసలే పవన్ వీరాభిమాని కావడం.. ఇప్పటికే రెండు సినిమాలు తీసి ఉండటంతో పవన్ మీద అభిమానాన్ని బండ్ల ఇంత బహిరంగంగా చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 

 

అయితే.. ఈ ట్వీట్లు చూసిన కొందరు మాత్రం.. పవన్ అంటే బండ్లకు ఎప్పుడూ ఉండే అభిమానమే కాదా అంటున్నారు. మరికొందరు మాత్రం.. పవన్ సినిమాలు చేయడం మొదలెట్టాడు.. దీంతో సినిమా కోసం పవన్ ను బాకా పట్టడం బండ్ల మొదలెట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా బండ్ల అంటే పవన్ అభిమానుల్లోనూ సాఫ్ట్ కార్నర్ ఉంది. గబ్బర్ సింగ్ లాంటి అసలుసిసలు మాస్ సినిమా తీశాడు కదా. మరి పవన్ బండ్లకు అవకాశం ఇస్తాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: