సుడిగాలి సుధీర్.. కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో కూడా తెలియదు.. ఆ తర్వాత ఓ ఛానల్ లో ప్రసారం అయ్యే చిన్న షో జబర్దస్త్ లో చిన్న స్క్రిప్ట్ లు చేసుకుంటూ ఉండే సుడిగాలి సుధీర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. తనలోని నటనను.. కామెడీని.. పాటలు.. అబ్బబా ఇలా ఒకటి కాదు.. అన్ని కలిపి ప్రదర్శించి ఈరోజు తనకంటూ ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. 

 

అలాంటి సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెర మీద సూపర్ హీరో. బుల్లితెరకు అద్భుత నటుడు సుడిగాలి సుధీర్. అతను తేరా మీదకు వస్తే.. ఎంత కోపంగా ఉన్నవారైనా నవ్వాల్సిందే.. ఆలా ఉంటుంది అతని నటన. అయితే జబర్దస్త్ షో తో ప్రారంభించిన నటన జీవితాన్ని ఢీ జోడితో ఇంకాస్త ముందడుగు వేసేలా చేశాడు. 

 

అక్కడ రష్మితో రొమాన్స్ పీక్ స్టేజ్ లో చేసి.. పాపం రష్మికి తనకు ఏదో నడుస్తుంది అనేలా చేశాడు. ఆలాంటి సుధీర్ ఈ మధ్యే.. అతని పేరుపైనే ఒక తోకను యాడ్ చేసి.. సాఫ్ట్ వెర్ సుధీర్ అని సినిమా చేశాడు. ఆ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయిట. 

 

అయితే ఈ నేపథ్యంలోనే నిన్న తన రొండో సినిమా.. తన టీమ్ తో 3 మంకీస్ సినిమాతో హీరోగా మరోసారి తెర మీదకు వచ్చాడు. అయితే సినిమా రివ్యూ అంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు అనే టాక్ తో నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సుడిగాలి సుధీర్ సినిమా రిలీజ్ కు ముందు మాట్లాడిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

 

అవి ఏంటి అంటే.. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ''నేను హీరోగా చేసిన సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. దానికి కారణం నేను ఫ్యామిలీలా భావించే ఫ్యాన్సే. హీరోగా ఓ సినిమాకు కమిట్‌ అయ్యాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో ట్యాగ్‌ వద్దే వద్దు'' అని చెప్పి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు ఈ సుధీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: