మన తెలుగు సీమలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అవార్డులు పట్టుకుపోతాయి. మరి కొన్ని సినిమాలు ఎప్పటికి గుర్తుంటాయి. ఎందుకంటే జనాన్ని పిచ్చోళ్లను చేసిన సినిమాలు అవే కదా.. ట్రైలర్ చూసి.. పోదాం పోదాం అని అనిపించేలా ట్రైలర్ ఉంటుంది. 

 

కానీ సినిమాలోకి వెళ్తే ఏమి ఉండదు.. ఆబ్బె ఈ సినిమాకు వచ్చామా మనము ఛీ అనిపించేలా చేస్తాయి... అరే.. చిన్న సినిమాలు అంటే ఏమో అనుకుంటాం అండి.. కానీ చివరికి పెద్ద సినిమాలు కూడా అలాగే చేశాయి.. ట్రైలర్ చూపించి సినిమా అద్భుతంగా ఉంటుంది అని థియటర్ కి రప్పించి పిచ్చి పట్టేలా చేసిన సినిమాలు కొన్నే ఉన్నాయి.  

 

కొన్ని కాదు చాలానే ఉన్నాయి.. కానీ అందులో సూపర్ గా పిచ్చి పట్టించిన.. అంటే థియేటర్ లో కూర్చున్న అర్ధగంటకే పిచ్చి పట్టించిన సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. మొట్ట మొదట.. మన గురువు గారు.. మూడు పెళ్లిళ్ల కళ్యాణుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం.. అబ్బబా..ఈయన తీసిన చాలా సినిమాలు ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశాయి. 

 

అయితే అందులో స్పెషల్ సినిమా ఒకటి ఉంది. అది ఏంటి అంటే ? తీన్మార్.. అబ్బబా.. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎలా పిచ్చి పట్టించారు అంటే.. మధ్యలోనే బయటకు వెళ్లి జండూ బామ్ తెచ్చుకునేంత పిచ్చి పట్టించింది. ఈయన ఖాతాలో మరో సినిమా కూడా ఉంది.. అదే అజ్ఞాతవాసి. ఈ సినిమా చూసి ఏదో ఉంటుంది అని వెళ్తే అందులో ఏమి లేదు. 

 

ఇంకా నెక్స్ట్.. అల్లు అర్జున్ సినిమా.. ''దువ్వాడ జగన్నాథం'' ట్రైలర్ ఆకాశాన్ని తాకింది.. సినిమా పాతాళానికి పోయింది.. ఇంకా ఇతడి ఖాతాలో మరో అద్భుతమైన సినిమా కూడా ఉంది.. అది ఏంటి అంటే.. ''వరుడు''. అప్పట్లో ప్రేక్షకులను మాములు పిచ్చోళ్లను చెయ్యలేదు ఈ సినిమాలు. 

 

ఇంకా మహేష్ బాబు కూడా తక్కువోడు కాదు.. ఈయన సినిమాలు ఇంకా ఎక్కువ.. పాపం ఎప్పుడు బాగా తీసే మహేష్. రెండు సినిమాలు హిట్ అయితే మూడు సినిమా ఖచ్చితంగా ప్లాప్ కావాలి... అలానే ఒకటి బ్రహ్మోత్సవం, రెండోవాది స్పైడర్.. అబ్బబా.. ఇలాంటి సినిమా ఈయన కెరియర్ లోనే నెవర్ బీఫారు.. ఎవర్ ఆఫ్టరు!

 

ఇంకా చెర్రీ విషయానికి వస్తే.. ఆరంజ్ సినిమా.. నిజంగా అది అద్భుతం అండి.. మ్యూజిక్ బాగుంది.. సినిమా స్టోరీ బాగుంది.. నటన బాగుంది.. కానీ మన తెలుగు ప్రజలకు అలాంటి సినిమాలు అర్థం కావు కాదండి.. తెలుగు ప్రేక్షకులు ఛీ కొట్టేశారు.. ఈ సినిమా చూసి.. వంద రూపాయిలు టికెర్ వేస్ట్ అనుకుంటూ ఇంటికి వచ్చేశారు. 

 

నాగార్జునకు 60 ఏళ్ళు వచ్చాయి అండి.. కానీ సినిమా స్టోరీ ఏం ఎంచుకోవాలో తెలియలేదు.. అందుకే ఎంతో అద్భుతమైన మన్మధుడు సినిమాను దాని సిఖ్వాల్ అంటూ తీసి బ్రస్టు పట్టించారు. సినిమా ట్రైలర్ అద్భుతం.. కానీ సినిమా ఏ వరస్ట్.. కోడలు వయసు ఆమెను హీరోయిన్ గా పెట్టి ముసలి మన్మథుడు అని అనిపించేసుకున్నాడు ఈ సినిమాతో. 

 

ఇంకా ఈ సినిమాలు అన్ని ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు చెప్పే సినిమా మరో ఎత్తు.. అది ఏంటి అంటే ? 6 అడుగుల బాహుబలి గారి సినిమా గురించి చెప్తున్నా.. అదేనండి.. ప్రభాస్ గారి సినిమా.. సాహూ.. సినిమాపై ఎన్నో ఆశలుపెట్టుకున్నారు.. సినిమా ట్రైలర్ లో ఓ రేంజ్ అనడం చూసి సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంటుంది అని ఆశపడి వెళ్లారు.. ఆలా వెళ్ళినవాళ్ళు ఆశలపై నీళ్లు చల్లి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసి పంపించాడు ప్రభాస్. 

 

ఇలా సినిమాల ట్రైలర్లు అద్భుతం.. సినిమాలు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఏది ఏమైనా ఈ సినిమా ట్రైలర్ చూసి సినిమా చూస్తే.. ఇంకోసారి ట్రైలర్ చూసి సినిమాకు వేళ్ళ కూడదు అని ఫిక్స్ అయిపోతారు.. మరి మీరు ఏం అంటారు? నిజంగానే అలానే అంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: