ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుతం సినిమాలు తీయలేకపోతున్నా ఇండస్ట్రీలోని రాజకీయాల పై అదేవిధంగా ప్రస్తుత తరం హీరోల పై అవకాశం వచ్చినప్పుడల్లా ఎదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. గత కొంతకాలంగా ఈయన తన సొంత వెబ్ ఛానల్ ద్వారా అనేక విషయాల పై తన అభిప్రాయలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన చిరంజీవిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.


చిరంజీవి ఈమధ్య అత్యంత విలాసవంతమైన ఒక భారీ ఇల్లు కట్టుకున్న సందర్భంలో ఇండస్ట్రీకి సంబంధించి అదేవిధంగా రాజకీయాలకు సంబంధించిన అనేకమంది ప్రముఖులు చిరంజీవి ఆహ్వానం మేరకు ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందినా మంత్రి తలసాని శ్రీనివాస్ చిరంజీవిని కలిసి చాల సుదీర్ఘంగా చర్చలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.


ఈ వార్తలు ఇలా రావడంతో త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నందీ అవార్డ్స్ కమిటీకి చిరంజీవిని చైర్మన్ గా ఉండమని అడగడానికి ఇలా తెలంగాణ మంత్రి ద్వారా రాయబారాలు జరుగుతున్నాయి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై స్పందిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ చాల విలక్షణంగా స్పందించాడు. 


చిరంజీవికి నిజంగా ఇటువంటి ప్రతిపాదన వచ్చి ఉంటే తాను చిరంజీవిని కలిసి ఆపదవిని తీసుకోవద్దు అని వివవరిస్తాను అంటూ కామెంట్ చేసాడు. దీనికికారణం నందీ అవార్డ్స్ కమెటీ చైర్మన్ బాధ్యత చాల కష్టమని ప్రతి సంవత్సరం నందీ అవార్డ్స్ ప్రకటించాక ఎదో ఒక వివాదాలు ఆ అవార్డ్స్ కమిటీ పై వస్తాయని అంటూ ప్రస్తుతం టాప్ హీరో స్టేటస్ లో ఉంటూ ఇండస్ట్రీలో అందరివాడుగా కనసాగుతున్న చిరంజీవికి ఇలాంటి పదవుల తలనొప్పి ఎందుకు అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు ఇలాంటి పదవులు ఇండస్ట్రీలో పనీపాట లేని వ్యక్తులకు ఇస్తే బాగుంటుంది కానీ అనుక్షణం బిజీగా ఉండే చిరంజీవి స్థాయికి ఇలాంటి పదవులు చాల చిన్నవి అంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: