నిన్నటి రోజున విడుదలైన ‘జాను’ విమర్శకుల నుండి సగటు ప్రేక్షకుడు వరకు టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా విడుదల ముందు మీడియాను తప్పించుకుని తిరిగిన శర్వానంద్ మీడియాతో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘జాను’ సక్సస్ పై తనకు పూర్తిగా నమ్మకం లేదని అయితే ఈ మూవీని తాను నిర్మాత దిల్ రాజ్ ఒత్తిడి పై చేసాను అంటూ కామెంట్ చేసాడు. 


అంతేకాదు ఈ విజయం తనకు వచ్చిన విజయం కన్నా దిల్ రాజ్ నమ్మకానికి వచ్చిన విజయంగా భావిస్తున్నాను అంటూ అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి ‘శతమానం భవతి’ మూవీలో కూడ తాను దిల్ రాజ్ ఒత్తిడితో నటించిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తన విజయాలకు పరోక్షంగా దిల్ రాజ్ కారకుడు అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించాడు. 


వాస్తవానికి ఈ సినిమా కోసం తాను పెద్దగా ఏమి శ్రమపడింది లేదనీ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సీన్ ను తనకు లోతుగా వివరించడంతో సహజంగానే తనలోని నటుడు బయట పడిన విషయాన్ని వివరించాడు. ఈ సినిమాలో తాను నటించిన రామ్ పాత్రకు తక్కువ డైలాగ్స్ ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ ఉండటంతో ప్రేక్షకులు ఈ కొత్త ప్రయోగాన్ని హర్షించడం తనకు కొండంత బలం ఇచ్చింది అంటూ కామెంట్ చేసాడు. 


ఇదే సందర్భంలో మాట్లాడుతూ తనకు బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ ఆదర్శం అని చెపుతూ అతడిలానే విభిన్న కథలతో సినిమాలు చేస్తూ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలి అన్నది తన ధ్యేయం అంటూ తన కల వివరించాడు. దీనితో ‘జాను’ విడుదల అయ్యేంత వరకు ఈ సినిమా సక్సస్ గురించి భయపడిన శర్వానంద్సినిమా హిట్ కావడంతో ఒకేసారి తనకు తాను ఆంద్రా అక్షయ కుమార్ గా భావిస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  ఒక సక్సస్ ఇచ్చే ఆత్మవిశ్వాసం శర్వానంద్ ను ఏకంగా అక్షయ కుమార్ తో పోల్చుకునేలా చేసింది అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: