బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోలుగా `ఆర్ఆర్ఆర్` పేరుతో ప్రేక్షకుల ఊహకు కూడా అందని భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్టును ప్లాన్ చేశాడు జ‌క్క‌న్న‌. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న సినిమా ఏదన్న ఉందంటే అది ఆర్ఆర్ఆర్ అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  చారిత్రక పాత్రలకు కాల్పనిక అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత జూలై 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ విడుదలతేదీ వాయిదాపడనున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్రబృందం కొత్త రిలీజ్‌డేట్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. 

 

అయితే వాస్త‌వానికి అనుకున్న సమయంకు ఈ సినిమాను రిలీజ్ చేయ‌డం రాజ‌మౌళికు పెద్ద క‌ష్టం కాదు. ఎందుకంటే.. ఇప్ప‌టికే షూటింగ్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చేయ‌డంతో పాటు పెద్దగా గ్రాఫిక్స్‌ వర్క్‌ లేదు. ఇక కాస్త అటు ఇటుగా విడుదల చేయడం సాధ్యమే. కాని బిజినెస్‌ లెక్కల కోసమే సినిమాను వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దాదాపుగా 400 కోట్ల బడ్జెట్‌ తో దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ మొత్తం రాబట్టడం రాజమౌళికి పెద్ద కష్టం ఏమీ కాదు. కాని సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యేలా చేసి 500 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సాధించాలనేది జక్కన్న అండ్‌ టీం ప్లాన్‌గా విశ్వ‌స‌నీయ‌వార్గాల స‌మాచారం. ఇలా సినిమా ఆలస్యం అవుతున్నా కొద్ది రేట్లు పెరుగుతూనే ఉంటాయి అన‌డంలో సందేహం లేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: