హాట్ బ్యూటీ కేథ‌రిన్ థ్రెసా ఎంత ప్రయత్నించినా కు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఈమె గ్లామర్ గా కనిపిస్తూ ఎక్స్ పోజింగ్ కు రెడీ అన్నా ఈమె వైపు టాప్ హీరోలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. ఇలాంటి పరిస్థితులలో వచ్చే వారం విడుదల కాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీతో అయినా తన దశ మారుతుందని కేథరిన్ ఆశపడుతోంది. 


కేథ‌రిన్ పై ప్ర‌త్యేక అభిమానం చూపించే బోయ‌పాటి శ్రీను ఇప్ప‌టికే ఆమెకు రెండు సినిమాల్లో అవ‌కాశాలిచ్చాడు. ఇప్పుడు మరొకసారి బాలయ్యతో తీయబోతున్న మూవీలో ఈమెకు అవకాసం ఇస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.


లేటెస్ట్ గా జరిగిన ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ ప్ర‌మోష‌న్ కార్యక్రమంలో పాల్గొన్న కేథరిన్ ను ఆ ఈవెంట్ ను కవరు చేయడానికి వచ్చిన మీడియా వర్గాలు ఆమెకు ఎదురెళ్ళి బాలయ్య సినిమాలో నటిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు అసహనానికి లోనైన కేథరిన్  ఈ ప్రశ్న తనను ఎందుకు అడుగుతారు దర్శకుడు బోయపాటిని అడగండి అంటూ ఆమె అసహనానికి లోనవ్వడమే కాకుండా ఆమె మీడియా కెమెరాలను తప్పించుకుని వేగంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది.  


వాస్తవానికి బాలయ్య బోయపాటిల మూవీకి సంబంధించి హీరోయిన్స్ ఎంపిక కష్టం అవుతున్న పరిస్థితులలో బోయపాటి కేథరిన్ ను ఈ విషయమై సంప్రదిస్తే ఆమె చుక్కలు చూపించే పారితోషికం అడిగినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనితో ఆమెను కాకుండా మరొక హీరోయిన్ వేటలో పడ్డాడు బోయపాటి. ఇప్పుడు ఈ విషయాలు మళ్ళీ మీడియా కేథరిన్ కు గుర్తు చేయడంతో ఆమె ఈ విధంగా అసహనానికి లోనై ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఎలా ఉన్నా బాలకృష్ణ లాంటి టాప్ హీరోకు ఇప్పుడు ఎదురవుతున్న హీరోయిన్ కష్టాలు మీడియా వర్గాలకు కూడ జోక్ అనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: