స్టార్ హీరోలతో సినిమా చేయటం అంటే మామూలు విషయం కాదు. కథా కథనాల ఎంపిక నుంచి షూటింగ్, ప్రమోషన్‌, రిలీజ్‌ ఇలా ప్రతీ విషయంలో హీరోల రేంజ్‌కు తగ్గట్టుగా దర్శక నిర్మాతలు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఇండస్ట్రీ దశాబ్దాలుగా ఉన్న స్టార్ హీరోతో సినిమా అంటే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. హీరో ఇమేజ్‌కు తగ్గ కథతో పాటు ఆ హీరో ఫ్యాన్స్‌ను అలరించే కథనంతో సినిమాను రూపొందించాల్సి ఉంటుంది.

 

ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఓ స్టార్ డైరెక్టర్‌. వరుసగా నాలుగు బ్లాక్‌ బస్టర్లు సాధించిన డైరెక్టర్, ప్రస్తుతం ఓ సీనియర్‌ స్టార్ హీరోతో సినిమా చేసే పనిలో ఉన్నాడు. చాలా కాలం విరామం తరువాత సినిమాల్లోకి వచ్చిన ఆ స్టార్‌ హీరో కథల ఎంపికతో పాటు సినిమా మేకింగ్‌లోనూ తన మార్క్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే కథ నుంచే అన్ని విషయాలో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాడట.

 

తన సినిమాల విషయంలో అన్నీ తానే అయి వ్యవహరించే దర్శకుడికి ఇది కాస్త ఇబ్బందికరంగా మారిందన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. టాప్ స్టార్‌తో సినిమా వచ్చిందని ఆనంద పడాలో లేక తను అనుకున్నట్టుగా కథా కథనాల విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నానని బాధపడాలో అర్ధం కావటం లేదట. గతంలో  చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే అయినా ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.

 

రీ ఎంట్రీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో ఆకట్టకున్న ఆ హీరో, తరువాత చేసిన ఓ భారీ చిత్రంతో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. దీంతో నెక్ట్స్ సినిమా విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సదురు హీరోగారి కొడుకే సినిమాను నిర్మిస్తుండటంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో దర్శకుడు ఇబ్బంది పడుతున్నాడు. అయితే సీనియర్‌ హీరోగారు మాత్రం తన ఇమేజ్‌, ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌, తన ఏజ్‌ ఇలా అన్ని లెక్కలు వేసుకొని అందుకు తగ్గట్టుగా దర్శకుడికి కండిషన్లు పెడుతున్నాడని గుసగుసలాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: