ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై భామ సమంత. ఆ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన జాను వరకు తన నటనతో కట్టిపడేస్తుంది సమంత. ముఖ్యంగా పెళ్లి తర్వాత సమంత్ చేస్తున్న సినిమాలు గమనిస్తే నటిగా ఆమె ఎంతో పరిణితో చేస్తున్నారని చెప్పొచ్చు. అక్కినేని కోడలిగా ఆ హీరో ఫ్యాన్స్ సైతం అందుకోలేని క్రేజీ హిట్లను ప్రస్తుతం సమంత అందుకుంటుంది. లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో హిట్ అందుకున్న సమంత ఈ ఇయర్ లో జానుతో హిట్ రేస్ మొదలు పెట్టింది.

 

జాను సినిమాలో సమంత నటన చూసిన వారికి మరో పదేళ్ల వరకు ఆమె కెరియర్ కు డోఖా లేదని మాత్రం అనుకుంటారు. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు సమంత. సాధారణంగా ఆఫ్టర్ మ్యారేజ్ ఏ హీరోయిన్ అయినా ఫేడవుట్ అవుతుంది. కాని సమంత మాత్రం పెళ్లి తర్వాత ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఎలాంటి సినిమా అయినా సరే ఎలాంటి పాత్ర అయినా సరే సమంత చేస్తుంది అంటే అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క.

 

తనకు వచ్చిన ఈ క్రేజ్ ను సమంత కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఇమేజ్ ఉంది కదా తను ఏం చేసినా సరే చెల్లుతుంది అన్న ధోరణిలో కాకుండా కథల సెలెక్షన్స్ లో కూడా చాలా కేర్ తీసుకుంటుంది. జాను తర్వాత సమంత అఫిషియల్ గా ఎలాంటి సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వలేదు. అమేజాన్ ఫ్యామిలీ మెన్ సీరీస్ లో మాత్రం విలన్ గా నటిస్తుంది. కెరియర్ లో ఫస్ట్ టైం నెగటివ్ రోల్ చేస్తున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉందని అంటుంది సమంత. సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటిన స్యాం డిజిటల్ ఫ్లాట్ ఫాం పై ఎలా చెలరేగిపోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: