మ్యాచో హీరో గోపించంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం  సీటీమార్.   మినిమం గ్యారెంటీ  డైరెక్టర్  సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా అలాగే యువ హీరోయిన్ దిగంగన  సూర్యవంశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల సీటీమార్ నుండి గోపిచంద్ ఫస్ట్ లుక్ విడుదలకాగా  తాజాగా ఈరోజు తమన్నా ఫస్ట్ లుక్  విడుదలైయింది. 
 
ఈచిత్రంలో తమన్నా, జ్వాలా రెడ్డి  పాత్రలో గర్ల్స్ టీం కబడ్డీ కోచ్ గా కనిపించనుండగా బాయ్స్  కబడ్డీ టీం కు కోచ్ గా గోపిచంద్ నటిస్తున్నాడు.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రం సమ్మర్ లో విడుదలకానుంది. ఇక గంత కాలంగా  వరుస పరాజయాలతో సతమతమవుతున్న గోపిచంద్ కు ఈ చిత్ర విజయం కీలకం కానుంది. కాగా  గోపించంద్ - సంపత్ నంది  కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు  వీరి  కాంబినేషన్ లో  గౌతమ్ నంద  తెరకెక్కగా ఆ సినిమా  ఆశించినఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఈ సారైనా వీరిద్దరూ  హిట్ కొడతారో చూడాలి. 
 
అలాగే తమన్నా, సంపత్ నంది డైరెక్షన్ లో నటించడం ఇది మూడో సారి. ఇంతకుముందు ఆమె  సంపత్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సరసన  రచ్చ ,మాస్ మహారాజ్ రవితేజ సరసన బెంగాల్ టైగర్ లో నటించగా  ఈరెండు సినిమాలు  విజయం సాదించాయి. అయితే ఎప్పుడూ రెండు మూడు సినిమాలతో బిజీగా వుండే తమన్నా సీటీమార్ తరువాత  తెలుగులో మాత్రం ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: