‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ గా మారడంతో అల్లు అర్జున్ సుకుమార్ మూవీ విషయంలో పెద్దగా ఎంటర్ కాకుండా అతడికి పూర్తి స్వేచ్చను ఇస్తూ ఆ మూవీ సుకుమార్ అనుకున్నట్లుగా పూర్తిచేయడానికి బన్నీ తనవంతు సహకారం అందిస్తాడు అని భావించారు అంతా. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయాలు వేరు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు సందడి చేస్తున్నాయి. 


‘అల’ సూపర్ సక్సస్ లో త్రివిక్రమ్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో పాటు తమన్ అందించిన ట్యూన్స్ ఈ మూవీ ఘన విజయానికి సహకరించాయి అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ అభిప్రాయమే బన్నీ సుకుమార్ ల మధ్య అనవసరపు పంతాలకు తావు ఇస్తోంది అంటూ గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుకుమార్ తీసిన సినిమాలు అన్నీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతోనే వచ్చాయి. దీనికితోడు సుకుమార్ దేవిశ్రీ ల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. 


ఇలాంటి పరిస్థితులలో తన లేటెస్ట్ మూవీకి కూడ దేవిశ్రీ సంగీతం ఇస్తాడు అంటూ సుకుమార్ చెపుతున్న మాటలను బన్నీ అంగీకరించకుండా తమన్ ను తన మూవీకి సంగీత దర్శకుడుగా ప్రకటించమని గట్టిగా పట్టుపడుతున్నట్లు టాక్. ఈ విషయంలో సుకుమార్ కూడ పట్టుదలతో ఉండటంతో ఇప్పుడు ఈ చిన్న భేదాభిప్రాయం ఈ మూవీ ప్రాజెక్ట్ కు చిచ్చు పెడుతుందా అంటూ వార్తలు వస్తున్నాయి. 


వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావలసి ఉంది. అయితే బన్నీ తన లుక్ విషయంలో మార్పులు చేసుకునేందుకు టైమ్ అడిగాడు అంటూ ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా సుకుమార్ ను ఈ మూవీ ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతి రోజు అయిన జనవరి 14న విడుదల చేయమని బన్నీ చెపుతున్నాడు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ముందు తాను నిలబడగలను అన్న ఆత్మవిశ్వాసం ఏకంగా ‘అల వైకుంఠపురములో’ సక్సస్ ఇచ్చిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: