సాధారణంగా పవన్ కళ్యాణ్ టాప్ హీరోలు వేసుకునేటట్లుగా తన శరీరం పై టాటూ లు వేసుకోడు. ఆడంబరాలకు విలాసవంతమైన జీవితానికి చాల దూరంగా ఉండే పవన్ ఇప్పుడు ఇలా అనుకోకుండా తన చేతి పై టాటు వేసుకుని నిన్న జనసైనికు లతో నిర్వహించిన సమావేశంలో కనిపించడం ఇప్పుడు పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. 


పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే జోష్ లోకి వెళ్ళిపోయిన పవన్ అభిమానులు అనేక ఫ్యాన్ మేడ్ పోష్టర్స్ ను రెడీ చేయడమే కాకుండా పవన్ ‘పింక్’ సినిమా రీ ఎంట్రీ లుక్ తో ఒక టి. షర్ట్ కంపెనీ విడుదల చేసిన టి షర్టులను కూడ పవన్ అభిమానులు విపరీతంగా కొంటున్నారు. 


ఇది ఇలా ఉండగా గురువారం ప్రారంభం అయిన క్రిష్ మూవీ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ సాయంత్రానికి గత రెండు సంవత్సరాలుగా పెంచుకున్న గడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో తన పొడుగాటి జుట్టుతో న్యూ లుక్ లో కనిపించడంతో పవన్ అభిమానులు సంబంరపడి పోతున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంటే జనసైనికుల సమావేశంలో పవన్ మాట్లాడుతున్నప్పుడు అతని చేతి పై ఉన్న టాటు ను గుర్తించిన అతడి అభిమానులు ఆ టాటు ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మార్చివేసారు. 

 

వాస్తవానికి పవన్ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా పవన్ ఇలాంటి టాటు లను వేయించుకుంటారు అంటే నమ్మరు. దీనితో అది క‌చ్చితంగా క్రిష్ సినిమా కోస‌మే అయి ఉంటుంద‌ని ప్రచారం జరుగుతోంది. ఆ టాటూ గ‌ద్ద‌ను ఆకారాన్ని పోలి ఉంది. చరిత్రలో మొగలాయిల కాలంలో బందిపోట్లు తమ చేతులకు ఇలాంటి ప‌చ్చ‌బొట్లు వేయించుకునే వారని చరిత్రకారులు చెపుతూ ఉంటారు. దీనితో క్రిష్ సినిమా కోసం పవన్ చాల మారిపోతున్నాడు అంటూ అభిమానులు పండుగాచేసుకుంటూ మంచి జోష్ లో ఉన్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: