ఈ మద్య వస్తున్న చిత్రాల్లో ఎక్కువగా లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్, బికినీ సీన్లతో హీరోయిన్లు తెగ హడావుడి చేస్తున్నారు.  అయితే కంటెంట్ ఉన్న చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో వస్తున్న చిన్న చిత్రాలు సైతం మంచి కలెక్షన్లతో దూసుకు పోతున్నాయి. అయితే ఈ రోజుల్లో ముద్దు సన్నివేశాలు లేని చిత్రాలను ఊహించుకోవడం కష్టమే.  ఒకప్పడు హాలీవుడ్ కే పరిమితం అయిన లిప్ లాక్ సీన్లు ఇప్పుడు ప్రతి చిన్నా, పెద్ద చిత్రాల్లో కామన్ అయ్యాయి. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ముద్దులో పలికించవచ్చు అంటున్నారు దర్శకులు. బాలీవుడ్ చిత్రాల్లో అయితే కిస్సింగ్ సీన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి  చిత్రాల్లోనూ లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి.   కాకపోతే స్టార్ హీరోల విషయంలో ఈ ముద్దు సీన్లు కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నా.. బిగ్రేడ్ చిత్రాల్లో అయితే ఆడియన్స్ కే విసుగు పుట్టించేంత సేపు ముద్దు సీన్లు ఉంటున్నాయి.  

 

అయితే కొంత మంది హీరో, హీరోయిన్లు ముద్దు సీన్ల విషయంలో నానా ఇబ్బందులు పుడుతున్నట్టు పలు ఇంటర్వ్యూలో చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ముద్దు సన్నివేశాల వెనక హీరోయిన్ల కష్టాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. కథ డిమాండ్ చేయడం వల్ల ఇలాంటి ముద్దు సీన్లలో నటిస్తున్నాం కానీ..అలాంటి సన్నివేశాల్లలో నటించేటప్పుడు తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని.. అది ఎవరూ పట్టించుకోరు అంటుంది బాలీవుడ్ హీరోయిన్ రిచా చడ్డ.  ఇక  ప్రతి చిత్రంలో బెడ్ రూమ్ సీన్స్ చాలా వరకు నటించింది ఈ ముద్దుగుమ్మ.

 

మీరందరూ మేం చేసే లిప్ లాక్ సీన్స్ చూసి హాయిగా ఎంజాయ్ చేస్తారు..  కానీ లోకేషన్ లో మేము ఎంత ఇబ్బంది పడతాము అనేది మీరు కనీసం కలలో కూడా ఊహించరు.. అక్కడ వందల మంది చూస్తుండగా కెమెరా ముందు ముద్దులు పెట్టుకోవాలి.  ఆ మద్య ఓ చిత్రంలో లిప్ లాక్ షార్ట్ తీస్తున్నాం... అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఓ కెమెరామాన్ వచ్చి డిస్ట్రబ్ చేశారు. దాంతో మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వచ్చింది అంటుంది రిచా. అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.. అలాంటివి చాలా ఉంటాయి.. అవన్ని అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి రిచా చడ్డా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: