ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో విజయ్ ఇంట్లో.. ఇతర చోట్ల ఐటీ శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. విజయ్ నివాసంలో జరిగిన ఐటీ సోదాలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. విజయ్ షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరీ అధికారులు ఆయన్ను గంటల తరబడి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మెర్సెల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా విజయ్ డైలాగ్స్ చెప్పినప్పట్నుంచే కేంద్రం ఆయన్ను టార్గెట్ చేసిందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు విజయ్ నివాసంలో 65 కోట్లకు పైగా నగదు దొరికిందని, దీనికి లెక్కల్లేవని ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన డబ్బు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో విజయ్, అజిత్ ఫ్యాన్స్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే.  

 

కానీ హీరోలు మాత్రం తామ మంచి మిత్రులం.. సినీ పరిశ్రమలో అందరూ కలిసే ఉంటాం.. మీరు కూడా అలాగే ఉండాలని ఫ్యాన్స్ కి హితబోత చేస్తుంటారు. నిన్న ఒక గనిలో షూట్ కి వెళ్ళగా అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు షూట్ అడ్డుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా వెళ్లి అడ్డుపడ్డంతో అక్కడ ఉద్రిక్తత నెలకొని లాఠీఛార్జి కూడా జరిగింగి. అయితే ఇప్పుడు అజిత్ ఐటి దాడుల గురించి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. పన్ను రేట్లు , టాక్సుల శాతం పెంచడం, ఆపై సెలెబ్రిటీలపై రైడ్స్ పేరుతో విరుచుకుపడడం లాంటి చర్యలు ఆపండి. ప్రజల సొమ్ముని సినిమా సెలెబ్రిటీలు దోచుకోవడం లేదు . డబ్బంతా అవినీతిపరులైన రాజకీయ నాయకుల వద్దే ఉంది . 

 

ఒక సారి అవినీతిపరులైన రాజకీయ నాయకులందరిపై రైడ్స్ చేయండి... ఇలా చేస్తే రాష్ట్రం కాదు..దేశమే బాగుపడుతుంది.. ఈ మాటలు ఒక ఇంటర్వ్యూలో అజిత్ అన్నారు. ఈ మాటలు గుర్తుకు చేస్తూ.. అజిత్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ కి ధైర్యం చెబుతూ పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ టాపిక్ గా నిలిచింది. ఏది ఏమైన కష్టం వచ్చినపుడు హీరోలే కాదు.. ఫ్యాన్స్ ఐకమత్యంగా ఉంటారని రుజువు చేశారని సినీ విశ్లేషకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: