చిరంజీవి కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎంత త్వ‌ర‌గా పూర్త‌యితే అంత మంచిద‌ని ఇటీవ‌లె చిరు కొర‌టాల‌తో అన్న విష‌యం కూడా అంద‌రికీ తెలుసు ఇక ఇదిలా ఉంటే...ఈ చిత్రాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయ‌డం కోసం కొర‌టాల ఆఘ‌మేఘాల్లో షూటింగ్ ప‌నుల్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి గోవింద ఆచార్య అనే పేరును కూడా సెలెక్ట్ చేశారు. అంతేకాక ఆయ‌న రాత్రి ప‌గ‌లు నిద్ర‌లేకుండా ఈ సినిమాని పూర్తి చేయ‌డ‌మే ప్ర‌ధాన ప‌నిగా పెట్టుకున్న‌రు. ఇక ఇదిలా ఉంటే... మ‌రో ప‌క్క ఆర్‌.ఆర్‌.ఆర్‌. షూటాంగ్ కూడా జ‌రుగుతుంది. ఆ చిత్రం 2021లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లె ఆ చిత్ర యూనిట్ తెలిపింది. అయితే తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ క‌లిసి చిరంజీవి కొర‌టాల చిత్రంలో కొన్ని సీన్స్‌లో న‌టించ‌నున్నార‌న్న విష‌యం ఆల్రెడీ తెలిసిందే. అయితే దాదాపు అర‌గంట పైనే ఆ సీన్లు ఉంటాయ‌ని కూడా అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, ఈ సినిమా 2020లో విడుదల కావడం లేదు. 

 

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్రం విడుద‌ల త‌ర్వాతే ఈ చిత్రం విడుద‌ల చేయాల‌న్న‌ది ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ష‌ర‌తు పెట్టిన‌ట్లు స‌మాచారం. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే రామ్‌చ‌ర‌ణ్‌ని ఆచార్య సినిమాలోకి తీసుకోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. అంతేకాక రామ్‌చ‌ర‌ణ్‌కు  ఈ సినిమాలో చరణ్ కు 40 నిమషాల పాత్ర వుంది. ఫైట్ వుంది, పాట వుంది. అందుకే ఈ సినిమాను 2020 దసరాకు కాకుండా 2021 సమ్మర్ కు విడుదల చేయించాలని చూస్తున్నారు.

 

గ‌తంలో మ‌హేష్‌బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 2018లో విడుద‌లైంది. త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేమ రామ జ‌న‌వ‌రి 2019లో విడుద‌లైంది. ఇప్పుడు ఈ చిత్రం మాత్రం 2020కి లేన‌ట్లే 2021 స‌మ్మ‌ర్‌కి ఖాయం చేయ‌నున్నారు. మ‌రి మెగా ఫ్యాన్స్‌కి ఈ సంవ‌త్స‌రం నిరాశే ఎదురైంద‌ని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: