దాదాపు కెరియర్ అయిపోయింది అనుకున్న ప్రతిసారి వరుస ఆఫర్లతో సర్ ప్రైజ్ చేస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఎఫ్-2 ముందు వరకు కెరియర్ అటు ఇటుగా ఉండగా ఎఫ్-2 హిట్ అమ్మడి కెరియర్ లో సూపర్ జోష్ తెచ్చింది. వెంకటేష్ సరసన పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకున్న అమ్మడు 2019లో తెలుగు, తమిళ, హింది భాషల్లో మొత్తం 7 సినిమాల్లో నటించింది. చిరు 151వ సినిమా సైరా నరసిం హా రెడ్డి సినిమాలో కూడా తమన్నా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది.

 

ఇక ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించింది తమన్నా. ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్, ఐటం సాంగ్స్ కు ఆమె పర్ఫెక్ట్ ఆప్షన్ అయ్యింది. బాలీవుడ్ క్వీన్ రీమేక్ గా తెరకెక్కించిన దట్ ఈజ్ మహాలక్ష్మి రిలీజ్ ఎప్పుడో తెలియదు కాని లేటెస్ట్ గా సంపత్ నంది డైరక్షన్ లో సీటిమార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది తమన్నా.

 

గోపిచంద్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తుంది. ఈమధ్య కెరియర్ పరంగా చాలా వెనుకపడ్డ గోపిచంద్ అలానే డైరక్టర్ గా ఏమాత్రం ఫాం లో లేని సంపత్ నంది కలిసి చేస్తున్న సినిమాలో తమన్నా నటిస్తుంది. ఈ సినిమా నుండి తమన్నా ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు. జ్వాలా రెడ్డి కబడ్డి కోచ్ గా తమన్నా లుక్ అదిరిపోయిందని చెప్పొచ్చు. తన ప్రతి సినిమాలో తమన్నాని సెంటిమెంట్ గా భావించి ఆమెను కొత్త యాంగిల్ లో చూపిస్తాడు సంపత్ నంది. అలానే సీటిమార్ ఫస్ట్ లుక్ లో కూడా అమ్మడు అదిరిపోయింది. తమన్నాని ఎలా వాడుకోవాలో సంపత్ కు తెలిసినంతగా మిగతా వాళ్లకు తెలియదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: