మెగా, మంచు ఫ్యామిలీ మధ్య జరిగే సంభాషణలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటికే చాలా వేదిక మీద మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబులు తమ మధ్య ఉన్న టామ్‌ అండ్‌ జెర్రీ సంబంధం గురించి చాలా సార్లు ప్రస్తావించారు. అయితే మాటల్లో కాస్త వెటకారం ధ్వనించిన ఈ రెండు కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాయి. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ యంగ్‌ జనరేషన్‌ హీరోలు కూడా ఆసక్తికర వ్యాఖ్యలతో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.

 

తాజాగా మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటరు. ఈ సినిమా ఇటీవల ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించాడు సాయి ధరమ్‌. తాజాగా సోలో లైఫ్‌కు సంబంధించిన అడ్వాంటేజ్‌ల గురించి ఓ ఇంట్రస్టింగ్ టెక్ట్స్‌ ను తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఈ ట్వీట్‌పై మంచు ఫ్యామిలీ హీరో విష్ణు మరింత ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.

 

`తమ్ముడూ మై లిటిల్‌ బ్రదర్‌ సాయి ధరమ్‌ తేజ్‌, ఈ ట్వీట్ నేను సేవ్‌ చేసుకున్నా.. ఇంకా ఎన్ని రోజులు సోలో చూస్తాగా` అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఫ్యామిలీ మేన్‌గా ఫుల్‌ బిజీ అయిపోయిన విష్ణు, సాయి ధరమ్‌ తేజ్‌ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కుతాడన్న ఉద్దేశంతో ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి విష్ణు ట్వీట్‌కు సాయి ధరమ్‌ ఎలా రిప్లై ఇస్తాడో చూడాలి.

 

సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ఫై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో సాయికి జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌ నటిస్తోంది. విష్ణు విషయానికి వస్తే చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు పేరుతో తెరకెక్కుతున్న ఇంటర్‌నేషనల్‌ మూవీలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: