రాజకీయాల నుండి సినిమారంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇటీవల వరుస పెట్టి సినిమా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాని తెలుగులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా మరియు అదే విధంగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా ఇలా మూడు సినిమాలు ఇప్పుడు లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘పింక్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కాగా ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆలీ కూడా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం జరిగాయి. గతంలో రాజకీయాల్లో ఉన్న సందర్భంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి పర్యటనలో రాజమండ్రిలో కమెడియన్ ఆలీ స్వస్థలంలో కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది.

 

ఆ సందర్భంలో ఆలీ కూడా తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ లు వేశారు. నేను నా సొంత గా ఇండస్ట్రీ లోకి వచ్చాను అని నాకు ఎవరు ముందు వెనక లేరని స్వయంకృషితో పైకి రావటం జరిగిందని నాపై చేసిన వ్యాఖ్యలకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని భారీ సెటైర్లు వేశారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆలీ సెంటిమెంట్ అయిన నేపథ్యంలో పవన్ నటించిన సినిమాలన్నిటిలో దాదాపు ఆలీ ఉండటంతో ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చాక పవన్ సినిమాలో ఆలీ ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. రాజకీయాల్లో ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత పెద్దగా గతంలో వాతావరణం ఇద్దరి మధ్య లేదన వార్త ఇండస్ట్రీలో కూడా ఉండటంతో...అటువంటి పరిస్థితుల్లో మధ్య తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఆలీ నటిస్తున్నట్లు వార్తలు రాగా దీనికి ఆలీ స్పందించారు.

 

పవన్ సినిమాలో నటించడానికి నేను ఎప్పుడు రెడీ అని రాజకీయాలు వేరు, సినిమా వేరని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పారు ఆలీ. అయితే.. ఇప్పటివరకూ పవన్‌ సినిమాలో చేయాలని నన్ను ఎవరూ ఆహ్వానించలేదని.. ఒకవేళ చేయమంటే తప్పనిసరిగా నటిస్తానని’ ఆలీ చెప్పడం విశేషం. ఏదేమైనా మళ్లీ వీరిద్దరూ కలిస్తే.. ఫ్యాన్స్‌కి పండగే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: