మెగా కుటుంబం నుంచి వచ్చి వెర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ఐదేళ్లలో మెగా ఫ్యామిలీ సేఫ్ వెంచర్ అయిన మాస్ మంత్రాన్ని జపించకుండా తనదైన పంధాలో వెళ్తూ సక్సెస్ లు సాధిస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలు, లవ్ స్టోరీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ను సెలక్ట్ చేసుకుంటూ కెరీర్ సాగిస్తున్నాడు. వరుణ్ తేజ్ సినిమా అభిరుచికి తగ్గట్టుగానే ఆయన పర్సనల్ లైఫ్ లో ఇష్టమైన హాబీని గుర్తించిన హెచ్ బీఓ ఇండియా ఆయనకు స్పెషల్ గిఫ్ట్స్ పంపింది.

 

 

వరుణ్ కు చిన్నప్పటి నుంచీ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్, కార్లు.. ఎంతో ఇష్టమట. సినిమాల్లోకి వచ్చాక సెలబ్రిటీ హోదా పొందిన వరుణ్ ఇష్టాల్ని తెలుసుకున్న హెచ్ బీఓ సంస్థ ఆయనకు ఈ బొమ్మలను గిఫ్ట్ గా పంపించింది. ఇందులో డీసీ కామిక్ బొమ్మలు, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్ మాస్క్ లను పంపించింది. దీంతో ఆశ్చర్యపోవడం వరుణ్ వంతైందట. ఈ ప్రెజెంటేషన్స్ ను చూసిన వరుణ్ ఎంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడట. దీంతో తన ఆనందాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తెలిపాడు. తను గిఫ్ట్ గా తీసుకున్న బొమ్మలను పిక్ తీసి అభిమానులతో పంచుకున్నాడు.

 

 

‘నా ఇష్టాలను తెలుసుకుని హెచ్ బీఓ ఈ గిఫ్ట్ లను పంపినందుకు కృతజ్ఞతలు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా బొమ్మలు’ అని తన వాల్ లో రాసుకున్నాడు. దీనికి నెట్టింట్లో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్వెల్ సినిమాలు, సూపర్ హీరోల సినిమాలు మరిన్ని చూడండి అంటూ మెసేజెస్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మాత‌లు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Some amazing guests decided to pay me a visit ! Thank you @hboindia for noticing my love for DC superheroes!!!

A post shared by varun Tej Konidela (@varunkonidela7) on

మరింత సమాచారం తెలుసుకోండి: