సినిమారంగంలో గ్లామరే ముఖ్యం. ఎంత గ్లామర్‌గా వుంటే అంతలా చూడ్డానికి ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ ఇష్టపడతారు. రజనీకాంత్‌ను 60ఏళ్ళు పైగా వున్నా ఇంకా చూస్తున్నారంటే సినిమాలో వేసిన అందమైన మేకప్‌. దానికితోడు కుర్ర హీరోయిన్లు చేయడం. ప్రస్తుతం టాలీవుడ్‌లో చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున చిత్రాల‌కు నాయిక‌లు దొరకాలంటే చాలా కష్టమైపోతుంది. వారి పక్కన నటించేందుకు కథానాయికల్ని ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. వెంకటేష్‌ ‘దృశ్యం’ చేసినప్పుడు మినాను ఎంపిక చేయాల్సి వచ్చింది. తను ఆ స్థాయి నటి కనుక చెల్లింది. ఆ తర్వాత ‘గోపాల‌ గోపా’లో శ్రియను ఎంపిక చేసుకున్నారు. మళ్ళీ రిపీట్‌గా తాజాగా ‘నారప్ప’లో వెంకటేష్‌ సరసన తననే ఎంపిక చేశారు. ఇందుకు నిర్మాత సురేష్‌బాబు చాలా కసరత్తు చేసి ఎంపిక చేయడం విశేషం. ఇక చిరంజీవి, నాగార్జున గురించి చెప్పాంటే ఇప్పటికే వాళ్ళు తమ మొహాల్ని ఇంకా ప్రేక్షకులు చూస్తున్నారంటే వాళ్ళ అభిమానం అంటూనే... పక్కన కొత్తగా హీరోయిన్ కనిపిస్తే చాలు కాస్త రిలీఫ్‌ వుంటుందని చెప్పకనే చెప్పారు. ఇలాంటి విషయంలో అల్లు అర్జున్‌ యంగ్‌లో వున్నా తన మనస్సులోని మాటను నిర్మొహమాటంగా ‘అల‌ వైకుంటపురంలో’ విడుదల‌ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు. ఆయన ఏమన్నారంటే.. నేను దాదాపుగా చాలా సినిమాలు చేశాను. ఏ ఒక్క హీరోయిన్‌ను రిపీట్‌ చేయలేదు. ఈ అమ్మాయిని ఇంతకుముందు చూశాం కదా! అని జనాలు అనుకుంటారు. అందుకే కొత్త మొహాల్ని చూపించాల‌ని ట్రై చేస్తుంటా. ‘అల‌ వైకుంఠపురంలో’కూడా పూజా హెగ్డేని ఎంపిక చేస్తున్నప్పుడు నాకు వద్దని చెప్పాను. కాని దర్శకుడు త్రివిక్రమ్‌ నేను చెప్పింది వినండి. మీకే ప్లస్‌ అవుతుందని ఒప్పించారు.. ఆతర్వాత మీకు తెలిసిందే’ అంటూ వ్యాఖ్యానించారు.

 

 అలాంటిది 40 ఏళ్ళుగా ఇండస్ట్రీలో వుంటున్న చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాల‌కృష్ణకు అంతకంటే ఎక్కువ సమస్యలే వున్నాయి. వారంతా శ్రియ, నయనతార, త్రిష కాంబినేషన్‌లో చేసిన వాళ్ళే. నయనతార అయితే ప‌లు భాషల్లో యంగ్‌ హీరోతోనూ పెద్దతరంవారితోనూ చేసేస్తుంది. అయితే నయనతారతో చేయాలంటే ఆమె డేట్స్‌ ప్రాబ్లమ్‌ కూడా వుంది. వెంకటేష్‌తో ‘బాబు బంగారం’లో ఆమె చేస్తున్నప్పుడు డేట్స్‌ క్లాష్‌ కావడంతో.. ఆ చిత్రంలో ఓ పాట‌ను తీయాల్సింది తీయలేకపోయారు. ఈ విషయాన్ని దర్శకుడు మారుతీ ఆ తర్వాత వెల్ల‌డించారుకూడా. ఏదిఏమైనా.. సీనియర్‌ స్థాయి నటీమణుల్ని పెట్టుకుంటే కొన్ని బాధ‌లున్నాయి. అయితేబాలీవుడ్‌ నుంచి హీరోయిన్లను తీసుకుస్తే వారికి తగిన రెమ్యునరేషన్‌ ఇవ్వాల్సిందే. రజనీతో సోనాక్షిసిన్హాను తీసుకుంటే.. అప్పట్లో ఆమెకు భారీగా రెమ్యునరేషన్‌ ఇచ్చారు. రజనీ చిత్రాలంటే ప‌లు భాషల్లో విడుదవుతాయి. అక్కడ వర్కవుట్‌ అవుతుంది. కానీ మన టాలీవుడ్‌లో చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జునతో చేయాంటే భారీ స్థాయిలో వారికి రెమ్యునరేషన్‌ ఇచ్చుకోవాల్సిందే. అలా ఇస్తే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసే విద్యాబాల‌న్‌ కూడా అంగీకరిస్తుంది. ఈ కోణంలో పలువురు నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కానీ బడ్జెట్‌ తడిసి మోపెడవుతుంది కూడా. ఏది ఏమైనా.. బాల‌కృష్ణ హీరోయిన్ల ఎంపిక విషయంలో పెద్దగా పట్టించుకోడు. తనకు సింక్‌ అవుతుందా లేదా! అనేది చూస్తాడు. అలా జైసింహా, పైసావసూల్‌తోపాటు ప‌లు చిత్రాలు చేసి చూపించాడు.

 


 ఐతే ఇక్కడ ప్రధాన సమస్య వుంది. అదేమంటే.. పెద్ద హీరోతో హీరోయిన్లు చేస్తే కథలో వారి ప్రాధాన్యత తగ్గిపోతుంది. దాన్ని ముందుగానే హీరోలు చెబుతుంటారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో రచయితలు దర్శకుడు, నిర్మాతు తగు జాగ్రత్త‌లు తీసుకుంటారు. అందుకే కాజల్‌, సిమ్రన్‌ వంటివారు అగ్రహీరోతో చేసినా వారి పాత్ర‌ నిడివి తక్కువగానే వుంటుంది. అందుకే చిరంజీవితో ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’లో.. కొఠారి అనే అమ్మాయిని తెచ్చారు. కానీ.. కథకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేసేశారు. కనుక హీరోలు పెద్ద మనస్సు చేసుకోవాలి. అలా అయితేనే వారు అనుకున్నట్లు నాయిక‌లు దొరకుతారు. హీరోయిన్ల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియం ఒకరంగా చెప్పాంటే అంతులేని కథలాంటిదే. అగ్రహీరోతో రాధిక, భానుప్రియ లాంటివారు చేసేవారు. మరలా వారు చేయడానికి అంగీకరించరు. అంగీకరించినా హీరోలు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రకృతి ధర్మంగా హీరోయిన్లు ఒక ఏజ్‌ వచ్చాక వారి భౌతికంగా మార్పు వస్తాయి. కనుక హీరోయిన్లను కొత్తవారిని ఎంపిక చేస్తుంటారు. దానికోసం దర్శక‌, నిర్మాత‌లు దక్షిణాదిలో ప‌లు బాషా చిత్రాల్లో నటించిన హీరోయిన్ల పై ఆసక్తి చూపుతారు. ఆ మధ్య ఓ అగ్రహీరో సరసన నటించడానికి కేరళ వెళ్ళి అక్కడ ఏజెంట్‌ ద్వారా ప్రయత్నాలు చేసిన సందర్భాలు వున్నాయి. అక్కడ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ సరసన నటించిన వారిని ఎంపిక చేసిన దాఖలాలూ వున్నాయి. ఏ భాషలోనైనా హీరోయిన్ల ఎంపిక అనేది కష్టమే.  ఈ విషయంలో వెంకటేష్‌ ఈమధ్యనే... ఇంకా మా మొహాల్ని ఎంతకాం చూస్తారు. అందుకే గెడ్డం పెంచో, గడ్డెంలేకుండానో.. రకరకా జిమ్మిక్కు చేస్తుంటామని వెల్ల‌డించారు. దాదాపు చిరంజీవి, నాగార్జున పరిస్థితి అంతే.. ఒక్కోసారి నాగార్జున గడ్డంతోనూ, మరోసారి స్లిమ్‌గానూ కన్పిస్తారు. అందుకే వారికి హీరోయిన్ల ఎంపిక కష్టమైనా.. దాన్ని ఇష్టంగా భావించే కొత్త వారు రావడం.. వారితో నటించడం జరుగుతుంది. అయితే వారికి పెద్దగా ప్రాధాన్యత వుండదు. ఇది ఇండస్ట్రీ రూల్‌. గ్లామర్‌గా వున్న అమ్మాయి కావాలంటే ఆమె చెప్పినట్లు ఇవ్వాల్సిందే. దానికి స్లార్‌ హోటల్ బిల్లు, ఆమెతోపాటు నలుగురు సహచరులు తగిన రెమ్యునరేషన్‌ నిర్మాత ఇవ్వాలి. ఇండస్ట్రీలో హీరో రాజ్యం కనుక వారు చెప్పినట్లు తీసుకువాల్సిన బాధ్యత దర్శక‌ నిర్మాతల‌దే.

మరింత సమాచారం తెలుసుకోండి: