దర్శక ధీరుడు రాజమౌళి తో ఓ హీరో సినిమా చేస్తున్నాడంటే ఆ హీరో తో పాటు అభిమానులు కూడా ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. ఎందుకంటే దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే బ్లాక్బస్టర్ బొమ్మ పడడం ఖాయం కాబట్టి. బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్.  ఈ సినిమాపై  ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటం  ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తుండడంతో... ఈ సినిమాపై మరింత హైప్  పెరిగింది. అయితే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఉంటుందని గతంలో వార్తలు కూడా వచ్చాయి. 

 


 ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అని అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఆర్ఆర్ఆర్  సినిమా తర్వాత మరోసారి రాజమౌళి ప్రభాస్తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్  సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో  తెరక్కబోయే  సినిమా కోసం ఇప్పటికే నిర్మాతలైన దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చి ఉన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. 

 

 ఏదైనా పక్క కథ ఉంటేనే రాజమౌళి రంగంలోకి దిగుతాడు అన్న విషయం తెలిసిందే. అందుకే రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలు  సెన్సేషనల్ విజయాలను సాధిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటికే ప్రభాస్ తో హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో మరోసారి ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత ప్రభాస్తో రాజమౌళి సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో మరోసారి మహేష్ బాబు తో పాటు మహేష్ ఫ్యాన్స్ కు కూడా మళ్లీ నిరాశే ఎదురయినట్లు  కనిపిస్తోంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఎంతో ఆశగా వేయికళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరికీ మళ్లీ నిరాశే ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: