దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. గతంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడనుందని వార్తలు వచ్చినా చిత్ర యూనిట్ ఆ వార్తలను ఖండించింది. తాజాగా చిత్ర యూనిట్ జనవరి 8 2021 ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని ప్రకటించడంతో రామ్ చరణ్, ఎన్టీయార్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 
 
తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో చిరంజీవి రాజమౌళిపై అసహనంగా ఉన్నట్టు సినిమా విడుదల వాయిదా పడటంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ విడుదల కానుండడంతో చరణ్ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా 2 సంవత్సరాల గ్యాప్ వస్తోందని చిరంజీవి ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి రామ్ చరణ్ సమయాన్ని వృథా చేస్తున్నాడని కూడా చిరంజీవి సన్నిహితుల దగ్గర చెప్పినట్టు ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. 
 
ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఎన్టీయార్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. కనీసం ఈ సంవత్సరమైనా ఆర్ఆర్ఆర్ విడుదలవుతుందని భావిస్తే విడుదల తేదీ వాయిదా పడటంతో నిరాశ చెందుతున్నట్టు జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ బహిరంగంగానే చెబుతున్నారు.                          
 
నిజానికి రాజమౌళి సినిమాలకు విడుదల తేదీ మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడని జక్కన్న సినిమా ఆలస్యం చేసినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ లకు ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం మాత్రం పక్కా అని సినీ అభిమానులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: