కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ ఐటీ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్‌ మాస్టర్ సినిమా షూటింగ్‌లో ఉండగా అక్కడి వెళ్లిన ఐటీ అధికారులు ఆయన్న షూటింగ్ నుంచి తీసుకెళ్లి మరీ విచారించారు. తరువాత కూడా ఐటీ దాడులు కొనసాగాయి. అంతేకాదు గతంలో అదిరింది సినిమాలో అధికారి బీజీపీ మీద విమర్శలు చేయటం వల్లే విజయ్‌ మీద ఈ దాడులు అన్న ప్రచారం జరుగుతోంది.

 

విజయ్‌కి ఇబ్బందులు ఐటీ దాడులతోనే పూర్తవ్వలేదు. తరువాత బొగ్గు గన్నుల్లో షూటింగ్ చేస్తుండగా కొంతమంది బీజీపీ కార్యకర్తలు షూటింగ్‌ను అడ్డుకున్నారు. ఇలా వరుసగా విజయ్‌ సినిమాకు ఇబ్బందులు ఎదురుకావటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ దాడుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

ఇప్పటికే సినీ రంగం అధికార పక్షం ప్రతిపక్షం అంటూ రెండు వర్గాలు విడిపోయినట్టుగా తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని పలువురు స్టార్ హీరోలు కూడా లోపాయకారిగా కొన్ని పార్టీలకు మద్దతు తెలుపుతున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్‌పై జరిగినట్టుగా దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ లిస్ట్‌లో పలువురు టాప్‌ స్టార్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

 

ముఖ్యంగా ఓ ఇద్దరు టాప్‌ స్టార్ల మీద ఈ దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు వైఎస్సార్సీపీ పార్టీలో ఉండి తరువాత టీడీపీలో చేరిన ఓ సీనియర్‌ నాయకుడు నిర్మాత కారణంగా ఓ టాప్‌ స్టార్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఆ స్టార్‌ హీరో బావ కూడా టీడీపీలో యాక్టివ్‌గా ఉండటం, అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆ ప్రభావం ఈ స్టార్ హీరో మీద కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

ఇక ప్రతిపక్షపార్టీకి భావి నేతగా భావిస్తున్న ఓ యంగ్ హీరోపై కూడా రాజకీయ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ యంగ్ హీరో  రాజకీయాలకు దూరంగా ఉన్నా ఎప్పటికైన తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతగా అవతరిస్తాడన్న ప్రచారమైతే ఉంది. మరి మన నాయకులు తమిళనాడు తరహా ప్రతికార దాడులు చేస్తారా..? లేక సినిమాలు వేరు రాజకీయం వేరు అని ఊరకుంటారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: