ఒక సినిమా తీయాలంటే లైట్ మెన్ నుండి దర్శకుడి వరకు ఎంతో మంది కష్టపడుతుంటారు. అయితే సినిమా అనేది ఒక కళ. ఇక్కడ డబ్బు సంపాదన కోసం వచ్చే వారికంటే సినిమా అంటే ప్యాషన్ తో వచ్చే వారే ఎక్కువ. అలాగే సినిమా అనే రంగుల ప్రపంచం అంటే అందరు చాల అందమయినది అని అనుకుంటారు. కానీ ఈ ప్రపంచం ముళ్ళతో కూడుకున్నది అని అందులో అడుగుపెట్టిన వారికీ మాత్రమే తెలుస్తుంది. ఒక సినిమా తీయాలంటే మెయిన్ పాత్ర దర్శకుడు. ఒక‌ దర్శకుడు ఎంతో మందికి లైఫ్ ఇస్తాడు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

ఇక ఒక దర్శకుడు అనిపించుకోవాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఒక్క ఛాన్స్ అంటూ...సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగి తిరిగి చివరకు సినిమాల్లో ఏదో ఒక అవకాశం దక్కించుకొని... ఆ అవకాశం ద్వారా ఎదిగిన  దర్శకులు, హీరోలు, నటులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా హీరో అవుదామ‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలామంది దర్శకులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఇలా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంద‌రో డైరెక్ట‌ర్లు ప‌రిచయ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఎంతమంది తొలిసినిమాతో సక్సెస్ కొట్టి స్టార్ దర్శకులు అయిన వారు ఉన్నారు.. కొందరు హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్న వారూ ఉన్నారు.  

 

ఇదిలా ఉంటే.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం టాలీవుడ్ డైరెక్ట‌ర్లు అగ్ర హీరోల‌తో సినిమా చేయ‌డానికి చుక్క‌లు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అగ్ర హీరోలతో సినిమా చెయ్యాలంటే దర్శకులు అన్ని వదులుకోవాల్సి వ‌స్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో కమర్షియల్ హీరోలు గా మారి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నార‌ట‌. దీంతో డైరెక్ట‌ర్ల‌కు స్వేచ్ఛ ఉండ‌డం లేద‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ విష‌యంలోనైనా హీరోలు చెప్పిన‌ట్టు  డైరెక్ట‌ర్ల‌ చేయాల్సి వ‌స్తోంద‌ని చ‌ర్చ‌లు సాగుతున్నారు. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: