ఆ మద్య తెలుగు వచ్చిన బిగ్ బాస్ 3 లో విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ పాపులారిటీ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.  చిన్న చిన్న స్టేజ్ షోస్ చేస్తున్న ఈ మాస్ సింగర్ తర్వాత సినిమాల్లో పాడటం మొదలు పెట్టారు.  ఆ తర్వాత సొంతగా ఆల్బామ్స్ చేయడం మొదలు పెట్టారు. ఇలా వరుసగా సక్సెస్ లు సాధిస్తున్న రాహూల్ సిప్లి గంజ్ ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీలో టైటిల్ సాంగ్ తో దుమ్మురేపాడు.  ఆ తర్వాత నాగార్జున హూస్ట్ గా నిర్వహించిన ‘బిగ్ బాస్ 3 ’ లో పాల్గొని తోటి కంటిస్టెంట్స్ హృదయాలు గెల్చుకోవడమే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచి ఓటింగ్ లో బిగ్ బాస్ 3 విజేతగా నిలిచాడు.  అయితే బిగ్ బాస్ 3 లో రాహూల్, పునర్నవి మద్య లవ్ యాంగిల్ బాగా ఎలివేట్ అయ్యింది.  వీరి మద్య గిల్ల కజ్జాలు.. ప్రేమలు, ముద్దూ ముచ్చట్లు అప్పట్లో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి.

 

 బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ కొంత కాలం కలిసి మెలిసి తిరిగారు.  అయితే తమ మద్య ఎలాంటి లవ్ యాంగిల్ లేదని.. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గానే కాకుండా నటుడిగా మంచి ఛాన్సులు వస్తున్నాయి. కృష్ణవంశీ సినిమా ‘రంగమార్తాండ’లో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఈ మూవీలో ఏకంగా రాజశేఖర్ కూతురు శివాత్మకతో జోడి కడుతున్నాడు.  అంతే కాదు రాహూల్ సిప్లిగంజ్ మరో అదృష్టాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్‌ యాక్ట్ చేస్తోన్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో మీనా, ఖుష్బూ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

 

కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.  అయితే మనోడు ఏ పాత్రలో కనిపించబోతున్నాడో ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు.  తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీయించుకున్న ఫోటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. రజీనీకాంత్‌తో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఈ చిత్రంలో రాహుల్ ఎలాంటి పాత్ర చేయబోతున్నడనేది చూడాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ పుణ్యమా ఈ కుర్ర సింగర్ నక్కతోక తొక్కడాని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: