హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన యువ హీరో నిఖిల్.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం తో ఆ తరవాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. కార్తికేయ, స్వామిరారా, అర్జున్ సురవరం వంటి హిట్ సినిమాలను కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి అందించాడు.అయితే ఈ మధ్య నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబందించిన నిశ్చితార్థం కూడా ఇటీవల చేసుకున్నాడు. 


అయితే మొదట పల్లవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొదట ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని అర్థమవుతుంది. ఆ తర్వాత నిఖిల్ బలవంతం మీద ఒప్పుకున్నారు. ఈ సందర్బంగా నిఖిల్ మాట్లాడూతూ.. ఐదు నెలల క్రితం నేను పల్లవిని ఓ పార్టీలో కలిశాను. తనని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె నెంబర్ తీసుకున్నాను.

 

ఆ తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. పల్లవికి నేనంటో ఇష్టం అని అర్థమైంది. తను నాకు పర్‌ఫెక్ట్ అని ఎప్పుడో అర్థమైంది. కానీ నేనే క్లారిటీ వచ్చాక మా ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నా. అయితే పల్లవి ఇంట్లో వాళ్లు మాత్రం మా ప్రేమను అంగీకరించలేదు... 
అలా కొద్దిరోజులు గడిచాక మా అమ్మ మాట్లాడి చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్లి నచ్చచెబితే అప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నారు. 

 

ఎంగేజ్‌ మెంట్ అయ్యాక నేను పల్లవికి ఐఫోన్, చాకొలెట్ డబ్బా కానుక గా ఇచ్చాను’ అని తెలిపారు.ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే ఇటీవల ‘అర్జున్ సురవరం’తో చాలాకాలం తర్వాత ఓ హిట్ అందుకున్నారు నిఖిల్. త్వరలో ఆయన ‘కేశవ’ సినిమాకు సీక్వెల్‌లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. బహుశా పెళ్లి తర్వాత నిఖిల్ తన తదుపరి సినిమాను ప్రకటించే అవకాశం ఉంది.. ఇటీవలే అర్జున్ సురవరం హిట్ అందుకున్నాడు నిఖిల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: