ఆయనో ప్రముఖ హీరో. స్వతహాగా పైకి ఎదిగాడు. ఎదిగాక ప్రముఖ బ్యానర్‌లో సినిమాలు చేశాడు. అగ్ర నిర్మాణ సంస్థ అధినేత కూడా ఆయనకు నచ్చి సేఫ్‌ ప్రాజెక్ట్‌ అని భావించి వరుస చిత్రాలు చేశాడు. కానీ ఓ సినిమా చేసేటప్పుడు జరిగిన అనుభవంతో అతనికి జ్ఞానోదమయింది.  దర్శకత్వంలో ఓనమాలు కూడా నేర్చుకున్న ఆయన ప్రతీ సన్నివేశాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకునేవాడు. ఒక్కోసారి ఓ దర్శకుడు సీన్‌ చెబితే.. ఇలా చేస్తే ఎలా వుంటుంది? థింక్‌ ఇట్‌.. అంటే.. నేనన్నానని కాదు.. మీరుకూడా ఆలోచించండి.. అనేవాడు. కొత్త దర్శకుల‌తో సినిమాలు చేయడంతో ఆ హీరోకు లాభించింది. చెప్పింది చెప్పినట్లు దర్శకులు చేసేవారు.

 


ఆ మధ్య మూడక్షరాల‌ పేరుతో సినిమా చేస్తే అది ఊహించని హిట్‌ అయింది. ఆ కాన్సెప్ట్‌ అంతకుముందు వచ్చిన ఓ సినిమాకు చిన్నపాటి మార్పు. అది సక్సెస్‌ అయ్యాక.. చూశారా! నేను చెప్పినట్లు.. ఎలా జరిగిందో అనే బిల్డ‌ప్‌ ఇవ్వడం ప్రారంభించాడు. ఏది ఏమైనా టైం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఆ తర్వాత కొందరు నిర్మాతలు ఆయన్ను అప్రోచ్‌ అయితే.. పెద్ద కోరికను వ్యక్తం చేశాడు. తను చెప్పినట్లు వినాలనేది మొదట కండిషన్‌. హీరోయిన్‌ విషయంలో సరేసరే. అతన్ని దాటి వెళ్ళనీయడు. రెమ్యునరేషన్‌ కూడా పెంచడంతో నిర్మాతలంతా బెంబేలెత్తున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో మాస్‌ హీరోగా పేరుపొందిన ఓ నటుడి తరహాలోనే మనోడు కూడా వరుస హిట్లతో వచ్చినా. 

 


ఇప్పుడు కొత్తతరం రావడంతో రేసులో వెనుకపడ్డాడు. దాంతో నిర్మాతలు కొత్తవారికోసం ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. ఏది ఏమైనా హిట్‌ వున్నప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. లేదంటే... వెనుకబడిపోయిన జాబితాలో చేరడానికి ఎంతోకాలం లేదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే మ‌న‌కు అవ‌కాశం దొరిక‌న‌ప్పుడు ముందు మంచి క‌థ‌ల‌ను ఎంచుకుంటూ కెరియ‌ర్‌ని నిల‌బెట్టుకోవాలి త‌ప్పించి లేనిపోని కండీష‌న్స్ అన్నీ ఎక్కువ పెట్టుకుంటూ పోతే ఎంత పెద్ద హీరో అయినా స‌రే ఈ మ‌ధ్య కాలంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌క్క‌న పెట్ట‌డానికి ఏమాత్రం సంకోచించ‌డం లేదు. ఇప్పటికే ఆ హీరో ఎవరనరేది మీకు తెలిసిపోయి వుంటుందిగదా..

మరింత సమాచారం తెలుసుకోండి: