ముంబయి, హైదరాబాద్ మధ్య ఎన్ని ఎక్స్ ప్రెస్ వేలు వచ్చినా.. పరిశ్రమల మధ్య దూరం మాత్రం తగదని చాలా కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఎక్కువ తక్కువ అనే తేడాలు తరగవనే స్టేట్ మెంట్ కూడా వింటుంటాం. అయితే ఇప్పుడీ మాటలన్నింటినీ హుస్సేన్ సాగర్ లో కలిపేస్తూ.. కొత్త బంధాలు వేస్తున్నారు బాలీవుడ్ స్టార్లు. 

 

బాలీవుడ్ సినిమాలు, దక్షిణాది చిత్రాలు అనే తేడాపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. ఇండియన్ సినిమాలో హిందీ స్టార్లకు ట్రీట్ మెంట్ మరోలా ఉంటుందనే మాటలు పబ్లిక్ గానే వినిపిస్తుంటాయి. కానీ సౌత్ సినిమా మార్కెట్ పెరిగాక, ఈ అవాంతరాలు కొంతవరకు తగ్గాయని చెబుతున్నారు టాలీవుడ్ జనాలు. దానికి ట్రిపుల్ ఆర్, సైరా సినిమాలను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. 

 

రాజమౌళి దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న సినిమా ట్రిపుల్ ఆర్. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడు. బాలీవుడ్ సింగంగా బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న ఈ హీరో ట్రిపుల్ ఆర్ కు ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదని చెబుతున్నారు. రాజమౌళిపై అభిమానంతో ఫ్రీగానే నటిస్తున్నాడట అజయ్. 

 

సైరా సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ కూడా సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు. చిరంజీవితో ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్దీ ఫ్రీగానే నటించాడు అమితాబ్. దీంతో హిందీ స్టార్లు తెలుగు సినిమాల్లో స్పెషల్ అప్పీరియన్స్ ఒప్పుకోవడమే స్పెషల్ అంటే.. ఫ్రీగా నటించడం అరుదై విషయమే అంటున్నారు సినీజనాలు. ఈ మధ్యకాలంలో దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన భారీగా వసూలు చేస్తున్నాయి. బాహుబలి, కె.జి.ఎఫ్ లాంటి సినిమాలు నార్త్ లో భారీగా వసూలు చేశాయి. దీంతో సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. ఈ రేంజ్ చూసే దక్షిణాది సినిమాల్లో కనిపించేందుకు ఓకే చెప్తున్నారట బాలీవుడ్ స్టార్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: