దాదాపు 13 ఏళ్ల తరువాత లేడీ సూపర్‌ స్టార్ విజయశాంతి, సరిలేరు నీకెవ్వరు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటిగా నటించిన విజయశాంతి ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించినట్టే అని అంతా భావించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాకలు మరో సీనియర్‌ నటి దొరికిందని దర్శకనిర్మాతలు అనుకున్నారు. అంతేకాదు కొంతమంది దర్శకులు లేడీ ఓరియంటెడ్ కథలతో విజయశాంతిని సంప్రదించారు కూడా.

 

అయితే అందరికీ షాక్‌ ఇస్తూ విజయశాంతి సినిమాలు చేయనని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు చేసే ఉద్దేశం తనకు లేటదని, పూర్తి సమయాన్ని ప్రజాసేవకే కేటాయించాలని భావిస్తున్నానని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దీంతో విజయశాంతి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఒక్క సినిమాతోనే ఆగిపోయిందని అభిమానులు నిరాశకు గురయ్యారు.

 

అయితే తాజాగా విజయశాంతి సినిమాల నుంచి తప్పుకోవటం వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న విజయశాంతి రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. అయితే త్వరలోనే మరో పార్టీలో చేరి పాలిటిక్స్‌లో యాక్టివ్‌ అవ్వాలని భావిస్తున్నారట. అయితే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన విజయశాంతికి ఇక్కడ మిగిలిన ఆప్షన్‌  ఒక్క బీజేపీనే మరి ఆమె ఆ పార్టీలోనే చేరుతుందేమో చూడాలి.

 

ఇక విజయశాంతి సినిమాలకు గుడ్‌బై చెప్పడం వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఆమె సినిమాల్లో నటించేందుకు భారీ కండిషన్స్‌ పెడుతుందట. తన పాత్రకు నిడివి, కథలో ఇంపార్టెన్స్ లాంటి అంశాల్లో ఆమె పెట్టే కండిషన్స్‌తో దర్శక నిర్మాతలు ఆమెను తీసుకునేందుకు జంకుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్‌ తరువాత ఆమె ఇంటి ముందు క్యూ కట్టిన దర్శక నిర్మాతలు తరువాత ముఖం చాటేశారట. అందుకే ఆమె సినిమాలు ఇక వద్దని, రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: