వావ్.. విక్టరీ వెంకటేష్.. సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరిద్దరి సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే గతంలో గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మల్టీస్టారర్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వెంకటేష్ ,మహేష్ బాబు హీరోలుగా నటించిన ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. 

          

అప్పుడు అసలు వాళ్ళ పెయిర్ కుదురుతుందా? లేదా అనే ప్రశ్నలు వచ్చాయి. ముల్టీ స్టార్స్ గా వారి సినిమా హిట్ అవుతుందా అనే ఆలోచనలో ఉండేవారు.. కానీ ఆ సినిమాలో కథ డిమాండ్ తక్కువ ఉన్న వాళ్ళ నటన వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళి అదే ముల్టీ స్టారర్..    

 

అయితే ఈసారి వీళ్ళ ఇద్దరే కాదు.. తెలంగాణ పోరడు.. గడ్డలకొండ గణేష్.. ప్రస్తుతం బాక్సర్ వరుణ్ తేజ్ కూడా వీళ్ళతో కలిసి నటిస్తున్నారు. అయితే ఆ సినిమా ఏదో కాదు ఎఫ్ 3. దర్శకుడు కూడా ఎవరో కాదు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ ముగ్గురు హీరోలకు బాగా అటాచ్ అయినా దర్శకుడు అనిల్ రావిపూడి.    

 

మహేష్ బాబుతో ఇటీవలే సరిలేరు నీకెవ్వరూ సినిమా తీసి యావేరేజ్ టాక్ తో వెళ్లిన అనిల్ రావిపూడి ఈసారి సూపర్ డూపర్ హిట్ కొడుతా అంటున్నాడు. అయితే అది ఎఫ్ 2 సీక్వల్ తో.  వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ లతో ఎఫ్ 2 కంటిన్యూ ఎఫ్ 3 ఉంటుందని టాక్. ఎఫ్ 3 సినిమాను ఈ సారి దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తాడ? లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: