టాలీవుడ్ స్టార్ హీరోలు కేవ‌లం సినిమాల్లో న‌టిస్తూ డ‌బ్బులు సంపాదించ‌డం ఒక్క‌టే ధేయ్యం కాదండోయ్‌. వాళ్ళ‌కు సైడ్ బిజినెస్‌లు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌హీరోకి సైడ్ బిజినెస్‌లు ఉన్నాయి. రియ‌ల్ ఎస్టేట్‌లు, హోట‌ల్ బిజినెస్‌లు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం హోట‌ళ్ళ‌నే పెడుతున్నారు. కొత్త హోట‌ల్స్ వ‌చ్చాయంటే చాలు కుర్రాళ్ళంతా కూడా అక్క‌డే ఎంగేజ్ అవుతున్నారు. ఆల్రెడీ అక్కినేని నాగార్జున ఎన్‌.గ్రిల్, ఎన్‌రెస్టారెంట్‌, తోపాటు చిరంజీవితో క‌లిసి కేర‌ళ బ్లాస్ట‌ర్స్‌లో పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నితిన్ నీర‌జ‌కోరెల టి.గ్రిల్ హీరో శ‌శాంక్ మాయాబ‌జార్ అంద‌రికంటే ముందు ద‌ర్శ‌కుడు కూచిపూడి వెంక‌ట్ ఉల‌వ‌చారు అనే రెస్టారెంట్‌ని మొద‌లు పెట్టారు. ఇక చిరంజీవి కేర‌ళ బ్లాస్ట‌ర్స్ స్పోర్ట్స్‌ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టారు. ఇక అల్లుఅర్జున్ జూబ్లీ 800 అనే ప‌బ్‌ని పెట్టారు. జ‌గ‌ప‌తిబాబు క్లిక్ సినీ కార్ట్ అనేది మొద‌లుపెట్టారు. మోహ‌న్‌బాబు శ్రీ విద్యా నికేత‌న్ అనే ఎడ్యుకేష‌న్‌ని పెట్టారు. రానా కా..క్వాన్ అనే దాన్నిపెట్టారు. రామ్ చ‌ర‌ణ్ ట్రూజ‌ట్ ఎయిర్‌వేస్‌ని పెట్టిన విష‌యం తెలిసిందే. మంచు విష్ణు న్యూయార్క్ ఎకాడ‌మీ. న‌వ‌దీప్ రా ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ని ఇలా ర‌క ర‌కాలుగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు.

 

అయితే ఇవ‌న్నీ హైద‌రాబాద్‌లో బాగా క్లిక్ అయ్యాయి. ఇక యంగ్ హీరోల విష‌యానికి వ‌స్తే హీరో సందీప్ కిష‌న్ జూబ్లీహిల్స్‌లో వివాహ భోజ‌నంబు రెస్టారెంట్‌ని స్టార్ట్ చేశాడు.  ఐతే నేటి తరం స్టార్ హీరోలు వరుసగా బట్టల వ్యాపారంలోకి దిగుతూ కొత్త ట్రెండ్ కి నాందిపలుకుతున్నారు. మొన్న విజయ్ దేవరకొండ, నిన్న ఛార్మి కౌర్, నేడు మహేష్, రేపు అల్లు అర్జున్ లు గార్మెంట్స్ బ్రాండ్స్ మొదలుపెట్టారు.

 

నిజానికి ఈ ట్రెండ్ ని ముందు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్‌ మొదలుపెట్టారు. ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో ఆయన స్టార్ట్ చేసిన బ్రాండ్ సూపర్ సక్సెస్ అయ్యింది. టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో ప్రాంచైజ్ తో కలిసి ‘రౌడీ’ పేరుతో ఓ గార్మెంట్ బ్రాండ్ ని నడుపుతున్నాడు. ప్రెజెంట్ విజయ్ కి యూత్లో ఉన్న పాపులారీ దృష్ట్యా ఈ బ్రాండ్ బాగానే సాగుతుంది. పూరితో కలిసి నిర్మాత గా మారిన ఛార్మి సైతం హీరో రామ్, పూరి ల ఇమేజ్ వేల్యూ తో ‘బి ఇస్మార్ట్’ పేరుతో ఓ ఆన్‌లైన్ గార్మెంట్స్ స్టోర్ స్టార్ట్ చేశారు. మొత్తానికి వీళ్ళ‌కున్న క్రేజ్‌ని కూడా వ్యాపారం చేసేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు.

 

ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా దీనికి అతీతుడేమీ కాదు ‘ది హుంబుల్ కో ‘ బ్రాండ్ నేమ్ తో అప్పెరల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఇక తాజాగా మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఓ గార్మెంట్ బ్రాండ్ వ్యాపారం మొదలుపెట్టనున్నారని సమాచారం.ఇలా స్టార్ హీరో లు ప్రజల్లో తమకు ఉన్న ఆదరణను తెలివిగా వ్యాపారం కొరకు ఉపయోగించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: