టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా నాగార్జున తర్వాత ఆయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్  లు హీరోలుగా పరిచయం అయ్యారు.  మనం సినిమాతో చిన్న ఝలక్ ఇచ్చిన అఖిల్ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్ ’మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  అయితే హీరోగా ఇప్పటి వరకు మంచి సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.  తాజాగా   అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్  మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. 

 

తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రేండింగ్ అవ్వ‌డం ఈ సినిమాకి మీద ఉన్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న అఖిల్ కి  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' అంటూ బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక ప్రయోగం చేయబోతున్నాడు.  Mr.మజ్నూ తర్వాత అఖిల్ మంచి జోష్ తో ఈ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఉండే యూనిక్ పాయింట్ యూత్ ని టార్గెట్ చేస్తుందని సమాచారం. 

 

 ఫస్ట్ లుక్ లో అఖిల్ సైలెంట్ గా చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళుతున్నాడు.  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో ఉండే 7 అడుగుల్లో మొదటి అడుగు ఇదేనని చెబుతూ కొత్తగా ట్వీట్ చేశాడు. చూస్తుంటే కుర్రాడికి లవ్ దెబ్బ తగిలినట్లు ఉంది. ఈ మూవీలో  అఖిల్ సరసన  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్, పూజా హెగ్ధే మ‌ధ్య న‌డిచే కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతుందని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. ఈ మూవీలో అఖిల్ అక్కినేని ఫ‌స్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: