తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా కోలీవుడ్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్, విజయ్, సూర్య, అజిత్ లాంటి హీరోతో పాటు ధనుష్ కూడా తన సత్తా చాటుతున్నాడు. అసురన్ సినిమాతో అదరగగొట్టిన ధనుష్ తాజాగా పటాస్ గావచ్చాడు. కోలీవుడ్ లో ఈ సినిమా మంచి టాక్ ను సొంతంచేసుకుంది. ఇక ఈ చిత్రం తెలుగులో విడుదల  చూస్తున్నారు చిత్ర నిర్మాతలు. తెలుగులో ధనుష్ కు మంచి మార్కెట్ఉంది.  సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు ధనుష్.  ధనుష్ నటించిన చిత్రాలు విడుదలై మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ధనుష్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘లోకల్ బాయ్’ మూవీ విడుదలకు రెడీ అయ్యింది.

 

తమిళ్‌లో సంక్రాంతికి విడుదలైన మంచి విజయాన్ని సాధించిన ‘పటాస్’ మూవీ తెలుగులో లోకల్ బాయ్ పేరుతో విడుదల చేస్తున్నారు.  ఇది  దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం ‘పటాస్‌’.  తెలుగులో ‘లోకల్‌ బాయ్‌’గా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహరీన్‌ కథానాయిక.  శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ధనుష్‌ తండ్రీ-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సాయిజ్యోతి ఫిలింస్‌ పతాకంపై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌-మర్విన్‌ స్వరాలు సమకూర్చారు.

 

ఈ మూవీలో ధనుష్ మార్షల్ ఆర్టిస్ట్ గా కిక్ బాక్సర్ గా కనిపిస్తూనే.. సాంప్రదాయ విద్యలో ఆరితేరినవాడి గా కనిపిస్తున్నారు.  చాలా కాలం తర్వాత ధనుష్ సరసన స్నేహ నటిస్తుంది. గత సినిమా ‘రఘువరన్ బీటెక్’ తెలుగులో మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రం ధనుష్ సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘మారి’లో లోకల్ డాన్‌గానూ మెప్పించాడు.  మొత్తానికి తెలుగు లో ధనుష్ చిత్రాలతో బాగా ఆకట్టుకోవడమే కాదు.. కలెక్షన్లు కూడా సాధిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: