నితిన్ హీరోగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాలో నుండి ఫస్ట్ సాంగ్ సింగిల్ యాంతంతో అలరించగా.. సినిమా నుండి సెకండ్ సాంగ్ వాటె బ్యూటీ కూడా హిట్ అయ్యింది. లేటెస్ట్ గా మూవీ నుండి సరాసరి అంటూ క్రేజీ సాంగ్ తో వచ్చేశారు. హీరోయిన్ ను వర్ణిస్తూ హీరో పాడుకునే సాంగ్ లా ఉన్న ఈ పాట మెలోడీతో ఆకట్టుకుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లోని ఈ సాంగ్ ప్రోమోనే మ్యూజిక్ లవర్స్ కు విపరీతంగా నచ్చుతుందని చెప్పొచ్చు. 

 

ఛలో సినిమాకు మ్యూజిక్ అందించిన మహతి స్వర సాగర్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అందులో చూసి చూడంగానే నచ్చేశావే సాంగ్ సూపర్ సెన్సేషన్ అయ్యింది. ఆ సాంగ్ వల్ల సినిమాకు క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ వస్తున్నాయి. భీష్మ సినిమాలో సరాసరి సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. 

 

ప్రస్తుతం ఫామ్ లో లేని నితిన్..  వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక ఇద్దరు కలిసి చేస్తున్న భీష్మ పక్కా హిట్ అనే సంకేతాలు వస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి లో ఎప్పుడు లేనిది వరుసగా క్రేజీ సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ వారం వచ్చిన జాను హిట్ టాక్ తెచ్చుకుంది. వచ్చే ఫ్రై డే విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ గా వస్తున్నాడు. ఇక ఒక వారం గ్యాప్ ఇచ్చి నితిన్ భీష్మ రిలీజ్ పెట్టుకున్నారు. మొత్తానికి సిని లవర్స్ కి ఈ నెల పండుగ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: