ఒకప్పుడు మురగసాద్ సినిమాలకి విపరీతమీన్ క్రేజ్ ఉండేది. కోలీవుడ్ లోనేకాదు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు. అయితే ఆ క్రేజ్ ఇప్పుడు తగ్గైపోయింది. ఇక తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన దర్బార్ పంపిణీదారులు తమకు తీవ్ర నష్టాలొచ్చాయంటూ లైకా- మురుగదాస్ బృందంపై గొడవకి దిగిన సంగతి తెలిసిందే. నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ ఆ ఇద్దరిని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో మురుగదాస్ తన ఇంటి దగ్గర కనపడకుండా.. గీతా కాంపౌండ్ లో ప్రత్యక్షమవడం తాజాగా ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది. మురగదాస్ అల్లు అర్జున్ తో సినిమా చేసే పనిలో బిజీలో ఉన్నారన్న వార్త  ముందు బయటకి వచ్చి చక్కర్లు కొడుతోంది. అయితే అది మాత్రం క్లారిటీ లేదు. 

 

ఇక అల్లు అర్జున్ కోసం బ్రహ్మాండమిన స్క్రిప్ట్ రెడీ చేసిన మురుగదాస్ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది.  బిజి బిజీగా గజిని 2 కోసం సన్నాహలు చేస్తున్నారంటూ అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలీలేదు గాని మెగా కాంపౌండ్ లో మాత్రం తిష్ఠ వేశాడట. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'గజిని 2' అనే టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించింది గీతాఆర్ట్స్ కావడంతో ఇది బన్నీకోసమేనంటూ హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి.

 

ఇంతకుముందు తమిళ స్టార్ హీరో సూర్య 'గజిని' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అదే సినిమాని హిందీలో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసి గీతా ఆర్ట్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుందన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అరవింద్ మైండ్ లో మురుగదాస్ తో సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది అంటూ చెప్పుకుంటున్నారు. 

 

గజిని 2 సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించాలని అరవింద్ బృందం ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. బన్నికి తెలుగు- మలయాళం- కన్నడ భాషల్లో మంచి మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళం - హిందీలోనూ స్టార్ స్టేటస్ ని సాధించాలంటే గజిని లాంటి ఒక సెన్సేషనల్ స్క్రిప్టు అయితే సాధ్యమవుతుంది. అందుకే గజిని 2పై బన్ని- మురుగదాస్ పూర్తిగా నిమగ్నమై ఉన్నారట. ప్రస్తుతం బన్ని సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా నటిస్తున్నారు. ఆ సినిమా కంప్లీటయ్యో లోపు మురగదాస్ కంప్లీట్ స్క్ర్తిప్ట్ తో సిద్దమవుతాడట. అయితే ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి మురగదాస్ తో సినిమా చేయొద్దని ఫ్యాన్స్ బన్నీకి సలహాలిస్తున్నారట. ఆయన్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కి భారీ డిజాస్ట్రస్ ని ఇచ్చాడు. అప్పటి వరకు ఉన్న వాళ్ళ ఇమేజ్ ని క్రేజ్ ని మొత్తంగా నాకించేశాడు. ప్రస్తుతం బన్నీ అల సక్సస్ తో మమచి ఫాం లోకి వచ్చాడు. దాన్ని చేస్తులారా నాశనం చేసుకోవద్దని బన్నీ కి చెబుతున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: