కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ విషయమై నానా రచ్చ చేసిన వర్ధమాన నటి శ్రీరెడ్డి, ఇటీవల కొద్దిరోజలుగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రస్తుత సినీ, రాజకీయ పరిస్థితులపై తనదైన స్టైల్ లో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మొదట్లో ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసింది శ్రీరెడ్డి. అయితే ఆ తరువాత తనకు కొందరు సినిమా వ్యక్తులతో పరిచయం ఏర్పడిందని, అలానే కొందరు అయితే తనకు అవకాశాలు ఇప్పిస్తాం అని చెప్పి లైంగికంగా వాడుకున్నట్లు అప్పట్లో శ్రీరెడ్డి వెల్లడించింది. వాస్తవానికి టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ విషయమై ఏకంగా మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి, అవకాశాల కోసం టాలీవుడ్ కి వస్తున్న అమ్మాయిలను కొందరు మేనేజర్లు, సినిమా కోఆర్డినేటర్లు ఛాన్స్ లు ఇప్పిస్తామని వారిని లైంగికంగా ఇబ్బందులు పెడుతున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

 

అయితే ఆ తరువాత ఆమె నిరసనకు స్పందించిన మా అసోసియేషన్, ఆడవారికి అసోసియేషన్ లోప్రత్యేక వింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెల్పడం జరిగింది. కాగా ఆ ఘటనతో విపరీతంగా పేరు సంపాదించిన శ్రీరెడ్డి, అనంతరం ఒక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. ఇక మధ్యలో పవన్ తో పాటు మరికొందు సినీ నటులపై కూడా విమర్శలు చేసిన శ్రీరెడ్డి, ఆపై కొరటాల శివ, సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్, హీరో నాని, మరొక దర్శకుడు శేఖర్ కమ్ముల సహా మరికొందరు పేర్లు బయట పెట్టి వారిపై నిందారోపణలు చేసింది. అయితే అదే సమయంలో హీరో నాని గురించి ఎంతో అసభ్యంగా వ్యాఖ్యానించింది శ్రీరెడ్డి. కాగా ఆమె వ్యాఖ్యలపై నాని మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇక కొద్దిరోజులకు అది చిలికి చిలికి గాలి వానగా మారి కోర్ట్ కేసు వరకు దారి తీయడంతో, 

 

ఒకానొక మీడియా ఛానల్ తో మాట్లాడిన శ్రీరెడ్డి, నాని గురించి తనకు తెలుసునని, ప్రస్తుతం అతడు చెప్తున్నవన్నీ అబద్ధాలని, ఈ విధంగా నిజాలు మాట్లాడుతున్న తనపై కేసులు పెట్టించి బోలెడు డబ్బు ఖర్చు పెట్టిస్తున్న నాని ఇంతకింత అనుభవిస్తాడని వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయమై ఎక్కడా కూడా ఇప్పటివరకు బహిరంగంగా స్పందించని నాని భార్య అంజనా, ఇటీవల తన సన్నిహితుల వద్ద శ్రీరెడ్డి విషయమై గట్టిగా మాట్లాడిందని, అలానే ఒకానొక సందర్భంలో శ్రీరెడ్డితో, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, ఇకపై మా ఆయన గురించి తప్పుగా ఇంకొక్క మాటంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి దీనితో అయినా ఇకపై శ్రీరెడ్డి నాని పై విమర్శలు చేయడం తగ్గిస్తుందో లేదో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: