ప్రముఖ కోలీవుడ్ హీరో ఇళయదళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా మన తెలుగు వారికి కూడా పరిచయం అవసరం లేదు. అక్కడ పెద్ద సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్, ఇక్కడ కూడా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇక ఇటీవల సర్కార్, అలానే బిగిల్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్, సర్కార్ తో ఒక మోస్తరు విజయాన్ని అందుకోగా, బిగిల్ సినిమా తెలుగులో పర్వాలేదనిపించగా తమిళ్ లో మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇకపోతే నిన్న హఠాత్తుగా విజయ్ కి సంబందించిన ఇళ్లతో పాటు ఆయనతో బిగిల్ సినిమాని తీసిన ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ యొక్క ఆఫీసులు, అలానే ఆ ప్రొడక్షన్ హౌస్ యొక్క నిర్మాతల ఇళ్ల లోను ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. 

 

దాదాపుగా కొన్ని గంటల పాట్లు పలు బృందాలు ఆయా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేసిన అనంతరం నిర్మాతల ఆఫీసు నుండి దాదాపుగా రూ.60 కోట్లకు పైగా ఇన్కమ్ టాక్స్ లెక్కలోకి రాని నల్ల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో విజయ్ ఇళ్లలో కూడా సోదాలు చేసిన అధికారుల పలు డాక్యుమెంట్స్, అలానే కొంత డబ్బును కూడా స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా బిగిల్ సినిమా తో పాటు పలు సినిమాలకు ఫైనాన్స్ అందిస్తున్న ఏజిఎస్ సంస్థ నల్ల డబ్బు లెక్కలపై ప్రశ్నించగా వారి నుండి సరైన సమాధానం లేదని అంటున్నారు. అలానే విజయ్ కు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాటికి కూడా లెక్కలు సరిగా లేవని, కావున మరికొద్దిరోజుల్లో ఇన్కమ్ టాక్స్ అధికారులు హీరో విజయ్ ను అలానే బిగిల్ సినిమా నిర్మాతలను అరెస్ట్ చేస్తారు అంటూ కోలీవుడ్ వర్గాల్లో ఒక వార్త తీవ్రంగా ప్రచారం అవుతోంది. 

 

అయితే ఈ విషయమై విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎందరో రాజకీయ నాయకులు తప్పుడు దారుల్లో డబ్బులు దోచుకుంటుంటే అవి పట్టించుకోని ఇన్కమ్ టాక్స్ అధికారులు, మా హీరోపై ఈ విధంగా దాడులు నిర్వహించడం అన్యాయం అని, అలానే ఆయనకు ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్ అరెస్ట్ విషయమై వస్తున్న వార్తలు అన్ని ఫేక్ మాత్రమే అని, కావాలనే కొందరు ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి చేస్తున్న కుట్ర అని, ఇన్కమ్ టాక్స్ అధికారులకు విజయ్ పక్కాగా లెక్కాలు చూపారని, అలానే ప్రతి ఏడాది ఆయన పక్కాగా టాక్స్ పే చేస్తారని అంటున్నారు. అయితే ఈ విషయమై ఏమి జరుగుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: