అక్కినేని సమంత, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సినిమా జాను. యువ స్పర్శకుడు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా యువ సంగీత దర్శకుడు గోవింద్ వసంత సంగీతాన్ని అందించాడు. ఇటీవల రెండేళ్ల క్రితం తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన 96 అనే లవ్ స్టోరీ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, శర్వా నటించారు అని చెప్పడం కంటే జీవించారని అంటున్నారు ప్రేక్షకులు. ఇక మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు చాలావరకు పాజిటివ్ టాక్ వినపడుతోంది. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా మంచి హృద్యమైన ప్రేమకథగా బలమైన కథనంతో ప్రేక్షకుల మనసులను కదిలించే స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత

 

శర్వా ఇద్దరూ కూడా జానకి, రామ్ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని, వారి అద్భుత నటనతో ప్రేక్షకుడు ఎక్కడా కూడా కన్ను తిప్పుకోలేడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఎంతో బాగా సాగిన ఈ సినిమా, సెకండ్ హాఫ్ లో మాత్రం కొంత నెమ్మదించినప్పటికీ, చివరికి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటివి సినిమాకు ప్రధాన బలంగా చెప్తున్నారు. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్స్ రాబడుతూ ముందుకు సాగుతున్న ఈ సినిమా, ఓవర్సీస్ లో మాత్రం దారుణంగా ముందుకు నడుస్తున్నట్లు అక్కడి ట్రేడ్ విశ్లేషకుల నుండి సమాచారం అందుతోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవని, గతంలో ఇక్కడ మంచి హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు కూడా ఓవర్సీస్ లో దారుణంగా ఫెయిల్ అయిందని, 

 

రాబోయే రోజుల్లో జాను పరిస్థితి కూడా అదే అని అంటున్నారు. అయితే అందుకు ముఖ్యకారణం ఏంటంటే, అవి రెండూ కూడా రీమేక్ సినిమాలు కావడం అని, అప్పటికే అక్కడి ప్రేక్షకులు వాటిని వేరే భాషల్లో చూసి ఉండడంతో, మళ్ళి రీమేక్ చేసినవి చూడడానికి థియేటర్ కి వచ్చేందుకు అక్కడి వారు అంత సుముఖత చూపరని, అందువల్లనే రాక్షసుడు మాదిరిగా జాను కూడా అక్కడ చతికిలపడిందని అంటున్నారు. మరి వారు చెప్తున్నా దానిని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో జాను అక్కడ కనీసం అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడినైనా రాబడుతుందో లేదో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: