యంగ్ రెబల్ స్టార్ కి లక్కీ హీరోయిన్ స్వీటి అనుష్క అన్న విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ప్రభాస్ తో అనుష్క మూడు సినిమాలు కలిసి నటించింది. బిల్లా, మిర్చి బాహుబలి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాహుబలి ప్రాంచైజీ అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కలకాలం నిలిచిపోతుంది. ఇక ఈ జంటని స్క్రీ మీద చూసిన ప్రేక్షకులకి మామూలుగా ఉండదు. ప్రభాస్ కటౌట్ కి స్వీటీ సూపర్బ్ గా సూటవుతుందని అందరు అనుకుంటారు. అందుకే వీళ్ళీద్దరికి ఎప్పుడు కామన్ గా ఒకటే క్వశన్ ఎదురవుతుంది. అదే మీరు మళ్ళీ కలిసి ఎప్పుడు నటిస్తారు అని. అంతేకాదు దాంతో పాటు మీరిద్దరు పెళ్ళి చేసుకుంటుమ్న్నారట కదా. అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని. 

 

ఈ ఇద్దరికి ఇలాంటి ప్రశ్న ఎదురవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటో అందరికి తెలిసినవే. మొదటిది ఇంకా ఇద్దరికి పెళ్ళి కాకపోవడం. దాంతో పదే పదే జనాలలో ఆసక్తికరంగా వీళ్ళ పెళ్ళి గురించి చర్చించుకోవడం. వీళ్ళు ఏ పబ్లిక్ ఫంక్షన్ లో కూడా కలిసే కెమరాలకి చిక్కుతున్నారు. అది కూడా పక్క పక్కన కూర్చొని. లేదా ఇద్దరు కలిసి ఒకే కారులో రావడం. ఇక ఇద్దరి బర్త్ డేస్ కైతే ఒకరికొకరు ఖరీదైన గిఫ్ట్స్ ని ఇచ్చి పుచ్చుకుంటారు.

 

దాంతో కొన్ని సందర్భాలలో అయితే వీళ్ళు సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసేసుకున్నారని వార్తలు పుట్టించారు. అవన్ని పుకార్లేనని ఎన్ని సార్లు తెలిసినా కూడా జనాలు వీళ్ళ ని మాత్రం వదలడం లేదు. జనాలలో ఎప్పుడు వీళ్ళ పెళ్ళి ఒక హాట్ టాపిక్. అయితే అనుష్క వీటి గురించి కొన్ని సార్లు క్లారిటీ కూడా ఇచ్చింది. ప్రభాస్ నేను మంచి స్నేహితులం. మా మాధ్య ప్రేమ లేదు. ఆయనంటే నాకు విపరీతమైన ఇష్టం. కాని అది ఒక గొప్ప ఫ్రెండ్ గానే. ఇక ప్రభాస్ ని నా లాంటి అమ్మాయి అసలు పెళ్ళి చేసుకోదు. ఎందుకంటే తనలో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పిది. ప్రభాస్ చాలా సున్నితమైన మనసు కలిగినవాడు. ఎవర్నీ చిన్న మాట అనడు. ముఖ్యంగా చాలా బోల్డ్ గా ఉంటాడు. అతి మంచితనం. స్వార్ధం అసలు ఉండదు. అమ్మాయిలంటే బోలెడంత సిగ్గు. ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఎలా ..అంటూ సరదాగా చెప్పింది. దీన్ని బట్టి అందరూ అనుకున్నట్టు ప్రభాస్ అనుష్క లవర్స్ కాదు మంచి ఇంకా చెప్పాలంటే గొప్ప ఫ్రెండ్స్ అని డిసైడైపోవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: