ఒకప్పుడు సినిమా అంటే ఓకే రకమైన మూసా కథలతో.. ఓకే ఫార్ములాతో సినిమాలు వచ్చేవి. కరెక్ట్ గా చెప్పాలంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, మూడు సెంటిమెంట్ సీన్లు అన్నట్టుగా ఉండేది. ఇలాంటి సినిమాకు మంగళం పాడేశారు తెలుగు ఆడియెన్స్. 2010 దశాబ్దం వరకు కూడా ఇలాంటి సినిమాలే వచ్చాయి. అయితే కాలానుగుణంగా మార్పులు రావడంతో సినిమా కథల్లో మార్పు వచ్చింది. ఎంతోమంది క్రియేటివ్ పీపుల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

 

అసలు సినిమాను అలా ఎందుకు తీయాలి ఇలా ఎందుకు తీయకూడదు అనే కొత్త ఆలోచనతో సినిమాలు చేస్తున్నారు. మారుతున్న ప్రేక్షకుల ఆలోచనకు తగినట్టుగానే సినిమాలు మారాయి. ఇప్పటికి కొన్ని రొటీన్ ఫార్ములా సినిమాలు వస్తున్నా ప్రేక్షకులు మాత్రం కొత్త కథలకే ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్స్ కూడా తమ ఇమేజ్ ను పక్కనాపెట్టి మరి ప్రయోగాలు చేస్తున్నారు. అంతేకాదు సమాజం మీద బాధ్యతతో కొన్ని సామాజిక అంశాలను టచ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. 

 

బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలియచేస్తుంటే.. లిమిటెడ్ బడ్జెట్ సినిమాలు కూడా సంచలన విజయాలు నమోదు చేసుకుంటున్నాయి.

 

కొత్త కథలు.. కొత్త ప్రయోగాలు..  స్టార్స్ కు పోటీ ఇస్తున్న కుర్ర హీరోలు.. స్టార్లకు షాక్ ఇచ్చేల యువ హీరోల సినిమా ఫలితాలు.. ప్రస్తుతం టాలీవుడ్ యువరక్తతో ఉరకలేస్తుంది. అందుకే ఎప్పుడు లేనివిధంగా టాలీవుడ్ సక్సెస్ రేటు పెరిగింది. మన తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకునేలా ప్రభావం చూపిస్తుంది.. ఇంతకన్నా ఒక తెలుగు సినిమా అభిమానిగా మనకు ఏం కావాలి..  ప్రస్తుతం వరుస సినిమాలతో స్టార్లు.. కొత్త ప్రయోగాలతో దర్శకులు ఇలా మొత్తం సినిమా పరిశ్రమ కళకళలాడుతుంది.. మంచి సినిమా తీయడం మీ వంతు దాన్ని సక్సెస్ చేయడం మా వంతు అన్నట్టుగా ఆడియన్స్ కూడా మంచి సినిమాలను ఆదరిస్తూ పరిశ్రమ ఎదుగుదలకు సహకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: