విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్... టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన యువ హీరో. యూత్ ఐకాన్ గా మారి తన ఆటిట్యూడ్తో మైమరిపించిన యంగ్ హీరో. ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో  యూత్ అందరికీ మరింత దగ్గరయ్యాడు. తన ఆటిట్యూడ్ మాటలతో యూత్ అందరికీ ఐకాన్ గా మారిపోయాడు. ముక్కుసూటిగా మాట్లాడుతూ... మెస్మరైజింగ్ ఆటిట్యూడ్ విజయ్ దేవరకొండ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. పెళ్ళి చూపులతో  హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో సెన్సేషనల్ విజయాన్ని సాధించి టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించి స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా తో 100 కోట్ల హీరోగా కూడా మారిపోయాడు విజయ్ దేవరకొండ. 

 

 అర్జున్ రెడ్డి హిట్ అవ్వగానే... ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ పేరు... అందరు విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుకునేవారు.. ఇలా భారీగా క్రేజ్ ఏర్పడింది విజయ్ దేవరకొండ కి. అయితే కొన్ని రోజుల వరకు విజయ్ దేవరకొండ పేరు టాలీవుడ్ అభిమానులందరినీ ఒక ఊపు ఊపింది అనే చెప్పాలి. కానీ ప్రస్తుతం విజయ్ పైన విజయ్ సినిమాలపైనా టాలీవుడ్ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. కొన్ని కొన్ని సార్లు విజయ్ ఆటిట్యూడ్ పై అక్కడక్కడా విమర్శలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం విజయ్ క్రేజ్ తగ్గిపోవడానికి ఆటిట్యూడ్ కూడా ఒక కారణం అంటున్నారు పలువురు అభిమానులు. 

 

 మితిమీరిన ఆటిట్యూడ్ సరైన కథలు ఎంచుకోక పోవడం.. అంతేకాకుండా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత యూత్ ని ఆకట్టుకునేలా... అద్భుతమైన కథాంశంతో... అదిరిపోయే రొమాన్స్ తో కూడిన సినిమాలు కూడా బాగానే వస్తుండడంతో విజయ్ సినిమాలకు ప్రేక్షకులు రోజురోజుకు క్రేజ్ తగ్గిపోతుంది అన్నట్లుగా అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్ మహేష్ బన్నీ చరణ్ సూపర్ ఫామ్ లో ఉండటం కూడా.. విజయ్ సినిమాలపై ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ క్రేజ్ తగ్గడంతో పాటు విజయ్ సినిమాల వైపు  కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి  అని సినీ విశ్లేషకులు అంటున్నారు. విజయ్ దేవరకొండ ఇంకొన్ని రోజుల్లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: