టాలీవుడ్‌లో ప్ర‌తి రోజు ఏదో ఒక కొత్త విష‌యాన్ని వింటూనే ఉంటాం. ప్ర‌తి రోజు ఏదో ఒక కొత్త సినిమా ఓపెనింగ్‌, అలాగే రిలీజ్ అయిన సినిమాల స‌క్సెస్‌లు, ఇంకా ఆల్రెడీ షూటింగ్ జ‌రుపుకుంటున్న సినిమాల విడుద‌ల తేదీల గురించి ప్ర‌తి రోజు మ‌న‌కు ఏదో ఒక వార్త తెలుస్తూనే ఉంటుంది. అందులోనూ సోష‌ల్ మీడియా పెరిగిపోవ‌డంతో ప్ర‌తి క్ష‌ణం ప్ర‌తి నిమిషం ఎక్క‌డ ఏం జ‌రిగినా కూడా అప్‌డేట్ న్యూస్ వ‌చ్చేస్తుంది. అలాగే శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు సినిమా ప్రేమికుల‌కు పండ‌గ‌నే చెప్పాలి. ఒక్కోసారి నాలుగైదు సినిమాలు విడుద‌లై ఏకంగా పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తెచ్చేస్తాయి. ఇక ఇదిలా ఉంటే ఈ వారం టాలీవుడ్ బెస్ట్ మూమెంట్స్ ఏంటో మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం.

 

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్‌.ఆర్.ఆర్‌. చిత్రం విడుద‌ల తేదీ గురించి అంద‌రూ ఎంతో ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా టాలీవుడ్‌లో ఇద్ద‌రు టాప్ హీరోలు ఈ చిత్రంలో న‌టించ‌డంతో దీనికి అంత క్రేజ్ వ‌చ్చింది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఈ చిత్రం 2021 జ‌న‌వ‌రి 8న విడుద‌ల అని రాజ‌మౌళి ఒక తేదీని ప్ర‌క‌టించారు. దీంతో ఫ్యాన్స్‌లో కాస్త టెన్ష‌న్ త‌గ్గింద‌నే చెప్పాలి. ఓ ప‌క్క రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం మ‌రోప‌క్క ఇద్ద‌రు టాప్ హీరోలంటే మాట‌లా మ‌రి ఆ మాత్రం టెన్ష‌న్ ఉండ‌టం కామ‌నే క‌దా. 

 

త‌ర్వాత అక్కినేని కోడ‌లు స‌మంత న‌టించిన `జాను` సినిమా విడుద‌లైంది. ఆ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆద‌ర‌ణ పొందింది. ఆల్రెడీ త‌మిళ్‌లో ఈ చిత్రం హిట్ అయిన‌ప్ప‌టికీ తెలుగులో కూడా అదే విధంగా క‌థ క‌థ‌నాల‌ను ఏమాత్రం మార్చ‌కుండా తెర‌కెక్కించ‌డంతో మంచి హిట్ టాక్‌ని సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో స‌మంత న‌ట‌న‌కి మంచి పేరు వ‌చ్చింది. స‌మంత న‌ట‌న గ‌రించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. 

 

కొర‌టాల‌శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టిస్తున్న చిత్రం గోవింద ఆచార్య టైటిల్ అనౌన్స్‌మెంట్ అయింది. అలాగే చిరంజీవి కోసం ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా తెర‌కెక్కిస్తున్నాడు కొర‌టాల‌. అలాగే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు నాలుగు చిత్రాల్లో న‌టిస్తున్నట్లు స‌మాచారం అందింది అది చాలా ఆనందమైన మూమెంట్ అని చెప్ప‌వ‌చ్చు. ఆల్రెడీ రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: