విజయ్ దేవరకొండ... ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత పెళ్లి చూపులు హీరోగా మారిపోయాడు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిపోయి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.ఇక  అర్జున్ రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త పుంతలు తొక్కుతూ సంచలన విజయాన్ని నమోదు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత గీత గోవిందం ఈ సినిమాతో 100 కోట్ల హీరోగా కూడా మారిపోయాడు. దీంతో విజయ్ దేవరకొండ పేరు ఎత్తితే చాలు యూత్ మొత్తం ఉర్రూతలూగి పోయేది. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ బాగా తగ్గినట్లు కనిపిస్తోంది. 

 


 మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా డియర్  కామ్రేడ్ సినిమాలు ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను కలిగించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. నోట డియర్ కామ్రేడ్ ఫ్లాప్ లు విజయ్ కి బాగా మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కానీ ఈ సినిమాకు అంతా బజ్  కనిపించడం లేదు. ఒకప్పుడు విజయ్ సినిమా వస్తుందంటే ఎన్నో రోజుల నుండి సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం టీవీ లో మొత్తం విజయ్ దేవరకొండ కు సంబంధించిన న్యూస్ ఏ వస్తుండటం అంతేకాకుండా సోషల్ మీడియాలో విజయ్ సినిమాకు సంబంధించి ట్రైలర్ పాటలు ట్రెండింగ్ అవుతుండడం జరిగేది. 

 

 కానీ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ విడుదలై రెండు రోజులైనా కూడా కేవలం ఆరు మిలియన్లు మాత్రమే ట్రైలర్కు దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు. విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కి అంతగా బజ్  లేదని. ట్రైలర్ లో  ఎన్నో రొమాంటిక్ సీన్స్.. ఫుల్లుగా లిప్లాక్లు దంచి కొట్టారు... మళ్లీ మళ్లీ చూడాలనిపించే షాట్స్... ఇవన్నీ పెట్టిన విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గడం వల్ల ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ ను ఎవరూ పట్టించుకోవడం లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే అంతకు ముందు భారీ అంచనాల మధ్య విడుదలైన డియర్ కామ్రేడ్ వలే  ఈ సినిమా కూడా నిరాశ పరిస్తే రౌడీ హీరో బ్రాండ్ వాల్యూ మరింత పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: